Ind vs Pak

228 పరుగుల తేడాతో ఓటమిపాలైన పాక్

టీం ఇండియా దాటికి చిత్తైపోయిన పాకిస్థాన్

స్పోర్ట్స్ రిపోర్ట్- టీం ఇండియా (Team India) ముందు పాక్ చిత్తయుపోయింది. లీగ్‌ దశలో పాకిస్థాన్‌ కొంచెం కంగారు పెట్టినా.. సూపర్‌-4 దశలో మాత్రం భారత్‌ ధాటికి పాకిస్థాన్ టీం (Pakistan) బెంబేలెత్తిపోయింది. భారీ వర్షం వల్ల రెండు రోజుల పాటు సాగిన మ్యాచ్‌ లో ఆద్యంతం భారత్‌ దే పైచేయి. బ్యాటింగ్‌ లో ఓపెనర్లు హాఫ్ సెంచరీ సాధిస్తే, తర్వాత  వచ్చిన ఇద్దరూ సెంటరీ మోత మోగించారు. తర్వాత బౌలింగ్‌ లోనూ భారత్‌ స్పీడుకు పాకిస్థాన్ జట్టు తట్టుకోలేకపోయింది. ఈ ఇన్నింగ్స్‌లో పాక్ బ్యాటర్లు ఒక్కరూ 30 స్కోరు దాటలేదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. మొత్తంగా కొలంబోలో టీమ్‌ ఇండియాకు పాక్‌ నుంచి కనీస పోటీ లేదని చెప్పాలి. భారత్ పాక్ మధ్య గెలుపు తేడా 228 పరుగులు అంటేనే పాక్‌ ఎంతటి ఘోర పరాభవం చవిచూసిందో అర్థం చేసుకోవచ్చు.

ఆసియా కప్‌ (Asia Cup 2023) సూపర్‌-4 దశలో టీమ్‌ ఇండియా ఘన విజయం సాధించింది. పాకిస్థాన్‌ ను ఏకంగా 228 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌ ఛాన్స్ కు అవకాశాలను పెంచుకుంది భారత్. ఆదివారం టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన భారత్‌ వర్షం వల్ల ఆట నిలిచిపోయే సమయానికి 147/2 తో నిలవగా, రిజర్వ్‌ డే అయిన సోమవారం ఇన్నింగ్స్‌లో మరో వికెట్‌ కోల్పోకుండా 356 పరుగుల భారీ స్కోరు చేసింది. వండర్ బ్యాటింగ్‌ తో అలరించిన విరాట్‌ కోహ్లి (122 నాటౌట్‌.. 94 బంతుల్లో 9×4, 3×6), కేఎల్‌ రాహుల్‌ (111 నాటౌట్‌.. 106 బంతుల్లో 12×4, 2×6) సెంచరీలతో సత్తా చాటారు. ఇక వికెట్ల ఛేదనలో స్పిన్నర్‌ కుల్‌ దీప్‌ యాదవ్‌ (5/25) ధాటికి పాకిస్థాన్ కాకవికలం అయిపోయింది. 32 ఓవర్లలో కేవలం 128 పరుగులకే పరిమితమైంది పాక్ జట్టు.

టీం ఇండియా ఇన్నింగ్స్‌-  రోహిత్‌ (సి) ఫహీమ్‌ (బి) షాదాబ్‌ 56; శుభ్‌మన్‌ (సి) అఘా సల్మాన్‌ (బి) షహీన్‌ 58; కోహ్లి నాటౌట్‌ 122; రాహుల్‌ నాటౌట్‌ 111; ఎక్స్‌ట్రాలు 9 మొత్తం: (50 ఓవర్లలో 2 వికెట్లకు) 356; వికెట్ల పతనం: 1-121, 2-123; బౌలింగ్‌: షహీన్‌ అఫ్రిది 10-0-79-1; నసీమ్‌ షా 9.2-1-53-0; ఫహీమ్‌ అష్రాఫ్‌ 10-0-74-0; రవూఫ్‌ 5-0-27-0; షాదాబ్‌ 10-1-71-1; ఇఫ్తికార్‌ అహ్మద్‌ 5.4-0-52-0

వన్డేల్లో విరాట్ కోహ్లి సెంచరీల సంఖ్య 47కు చేరింది. సచిన్‌ టెండుల్కర్ పేరుతో ఉన్న అత్యధిక సెంచరీల రికార్డు (49) కు అతను మరింత దగ్గరయ్యాడు. సచిన్‌ టెండుల్కర్ 463 వన్డేలాడగా, విరాట్ కోహ్లికిది 278వ మ్యాచ్‌ మాత్రమే. మొత్తంగా విరాట్‌ కోహ్లీ కి ఇది 77వ ఇంటర్నేషనల్ సెంచరీ.

పాకిస్థాన్‌ ఇన్నింగ్స్‌-  జమాన్‌ (బి) కుల్‌దీప్‌ 27; ఇమాముల్‌ (సి) శుభ్‌మన్‌ (బి) బుమ్రా 9; బాబర్‌ (బి) హార్దిక్‌ 10; రిజ్వాన్‌ (సి) రాహుల్‌ (బి) శార్దూల్‌ 2; అఘా సల్మాన్‌ ఎల్బీ (బి) కుల్‌దీప్‌ 23; ఇఫ్తికార్‌ (సి) అండ్‌ (బి) కుల్‌దీప్‌ 23; షాదాబ్‌ (సి) శార్దూల్‌ (బి) కుల్‌దీప్‌ 6; ఫహీమ్‌ (బి) కుల్‌దీప్‌ 4; షహీన్‌ నాటౌట్‌ 7; ఎక్స్‌ట్రాలు 17 మొత్తం: (32 ఓవర్లలో ఆలౌట్‌) 128; వికెట్ల పతనం: 1-17, 2-43, 3-47, 4-77, 5-96, 6-110, 7-119, 8-128; బౌలింగ్‌: బుమ్రా 5-1-18-1; సిరాజ్‌ 5-0-23-0, హార్దిక్‌ 5-0-17-1; శార్దూల్‌ 4-0-16-1; కుల్‌దీప్‌ 8-0-25-5; జడేజా 5-0-26-0 

Asia Cup 2023


Comment As:

Comment (0)