BRO Movie

పవన్ కళ్యాణ్ ‘బ్రో’ ట్రైలర్‌ అదిరిపోయింది

సినిమా రిపోర్ట్-  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘బ్రో’ (BRO). ప్రముఖ నటుడు సముద్రఖని డైరెక్టర్. కోలీవుడ్‌ సూపర్‌ హిట్‌ సినిమా వినోదాయ సిథం కు రీమేక్‌ గా తెలుగులో బ్రో రూపుదిద్దుకున్న మూవీ.  పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) తో పాటు సాయిధరమ్‌ తేజ్‌ (Saidharam Tej) కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నాడు. ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ (Priya Prakash Warier), కేతికా శర్మ (Ketika Sharma) లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

సినిమా విడుదలకు మరో ఆరు రోజుల సమయం మాత్రమే ఉండటంతో శనివారం ‘బ్రో’ ట్రైలర్‌ (BRO Trailer) ను చిత్ యూనిట్ విడుదల చేసింది. పవన్‌ కల్యాణ్‌ నటన, ఆయన పంచ్‌ డైలాగ్‌లు అదిరిపోయాయని అభిమానులుంటున్నారు. మరోవైపు మార్క్‌ పాత్రలో సాయి ధరమ్‌ తేజ్‌ రియాక్షన్స్‌, బ్రహ్మానందం కామెడీ నెక్ట్స్ లెవల్ లో ఉన్నాయని చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా జులై 28న ఈ సినిమా విడుదల కాబోతోంది. 


Comment As:

Comment (0)