Vikram Pragyan

ల్యాండర్‌, రోవర్‌లు ఏం పని చేస్తాయన్నది వెల్లడించిన ఇస్రో

చంద్రుడిపై దిగిన చంద్రయాన్‌ 3 లోని ల్యాండర్‌, రోవర్‌లు ఏం చేస్తాయే తెలుసా

స్పెషల్ రిపోర్ట్- భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో (ISRO) ప్రయోగించిన చంద్రయాన్‌-3 (Chandrayaan 3) సక్సెస్ ఫుల్ గా చంద్రుడిపై ల్యాండ్ అయ్యింది. ఈ ప్రయోగంతో ఇస్రో సరికొత్త రికార్ట్ నెలకొల్పింది. చందమామ దక్షిణధృవంపై అడుగుపెట్టిన అరుదైన ఘనత భారత్ సొంతమైంది. మొత్తం ప్రపంచం ఉత్కంఠగా ఎదురు చూసిన ఉద్విగ్న క్షణాల మధ్య చంద్రయాన్-3 ల్యాండర్‌ విక్రమ్‌ చంద్రుడిపై కాలుమోపింది. చందమామ దక్షిణధృవ ఉపరితలంపై సురక్షితంగా దిగడంతో ఆ తర్వాత ల్యాండర్‌, రోవర్‌ లు ఏంచేయబోతున్నాయన్నది అందరిలో ఆసక్తిరేపుతోంది. మరి చంద్రయాన్-3 ల్యాండర్‌, రోవర్‌లు చంద్రుడిపై ఏం చేయనున్నాయన్నది తెలుసుకుందామా...

చంద్రుడి దక్షిణధృవంపై చంద్రయాన్-3 ల్యాండింగ్‌ ప్రక్రియ సక్సెస్ కావడంతో, ల్యాండర్‌ విక్రమ్‌ (Vikram Lander) లోపలి నుంచి ప్రగ్యాన్‌ రోవర్‌ (Pragyan Rover) కొంత సమయం తరువాత బయటికొస్తుంది. ప్రగ్యాన్ రోవర్ ను ఎప్పుడు బయటకు రప్పించాలన్నదానిపై ఇస్రో నిర్ణయిస్తుంది. విక్రమ్ ల్యాండర్ కు అమర్చిన సైడ్‌ ప్యానళ్లను ర్యాంప్‌ గా ఉపయోగించుకుని,  చండ్రుది ఉపరితలంపైకి మెల్లిగా జారుతుంది. ఆ తరువాత చంద్రుడి పరిసర ప్రాంతాల్లో మొత్తం 14 రోజుల పాటు ల్యాండర్‌, రోవర్‌ లలో ఉన్న పేలోడ్‌ లు తమ విధులను నిర్వర్తిస్తాయి. సోలార్‌ ప్యానెల్‌ల ద్వారా పవర్ ను పొందే విక్రమ్‌, ప్రగ్యాన్‌ల జీవితకాలం 14 రోజులే. అందుకే చంద్రుడిపై సూర్యరశ్మి ఉన్నంతసేపే ఈ వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తాయి. సూర్యాస్తమయం అయ్యాక  అక్కడ మొత్తం చీకటిగా మారుతుంది. ఆ సమయంలో ఉష్ణోగ్రతలు మైనస్‌ 180 డిగ్రీల సెల్సియస్‌ కు పడిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో ల్యాండర్‌, రోవర్‌ వ్యవస్థలు మనుగడ సాగించడం సాధ్యమయ్యేపనికాదు.

చంద్రుడిపై ల్యాండర్ చేసే పరిశోధనలు నేరుగా భూమ్మీద బెంగళూరులో ఉన్న ఇస్రో పర్యవేక్షణ కేంద్రంతో కమ్యూనికేట్‌ చేయనుండగా, రోవర్‌ ల్యాండర్‌ కు మాత్రమే కమ్యూనికేట్‌ చేస్తుంది. చంద్రయాన్‌-3లో ప్రొపల్షన్‌ మాడ్యూల్‌తో పాటు (PM) ల్యాండర్‌ (Vikram), రోవర్‌ (Pragyan) లను పంపించారు. వీటిలో మొత్తం ఐదు పరిశోధక పేలోడ్‌లు (Scientific Payloads) ఉన్నాయి. చంద్రుడిపై వాతావరణ పరిస్థితులు, ఉపరితల నిర్మాణం వంటి అంశాలను అవి నిశితంగా శోధించనున్నాయి. చంద్రయాన్‌-3లో వెళ్లిన ల్యాండర్‌ పేరు విక్రమ్‌. దీని బరువు రోవర్ తో కలిపి 1749.8 కిలోలు. దీని జీవితకాలం 14 రోజులు. అంటే చంద్రుడిపై ఒక పగలుతో సమానం. రెండు మీటర్ల పొడవు, మీటర్ల వెడల్పుతో కూడిన ఈ ల్యాండర్‌ లో మూడు పేలోడ్‌ లను అమర్చారు.

అందులో రేడియో అనాటమీ ఆఫ్‌ మూన్‌ బౌండ్‌ హైపర్‌సెన్సిటివ్‌ ఐనోస్పియర్‌ అండ్‌ అట్మాస్పియర్‌ (RAMBHA) మఖ్యమైంది. ఇది చందమామ ఉపరితలంపై ప్లాస్మా (అయాన్లు, ఎలక్ట్రాన్‌ల) సాంద్రతపై పరిశోధన చేయనుంది. ఆ తరువాత చెప్పాల్సింది చంద్రాస్‌ సర్ఫేస్‌ థర్మో ఫిజికల్‌ ఎక్స్‌పెరిమెంట్‌ (ChaSTE: ) గురించి. ఇది చంద్రుడి ఉపరితలంపై ఉష్ణ లక్షణాలను లెక్కిస్తుంది. మరో ముఖ్యమైన పేలోడ్.. ఇన్‌ స్ట్రుమెంట్‌ ఫర్‌ లూనార్‌ సీస్మిక్‌ యాక్టివిటీ (ILSA). ఇది చంద్రయాన్‌-3 దిగిన ప్రాంతంలో భూకంపాల తీవ్రతపై ప్రయోగాలు చేస్తుంది. చంద్రుడి పొరలు, మట్టి స్వభావాన్ని నిశింతగా పరిశీలిస్తుంది. మరో పేలోడ్ .. లేజర్‌ రెట్రోరిఫ్లెక్టర్‌ అర్రే (LRA). ఇది అమెరికా అంతరిక్ష పరిశోధక సంస్థ నాసాకు (NASA) చెందిన పే లోడ్. చందమామపై గతిశాస్త్రాన్ని అర్థం చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని ఇస్రో తెలిపింది.

ఇందులో మొత్తం ఏడు సెన్సార్లతో పాటు ల్యాండర్‌ హజార్డ్‌ డిటెక్షన్‌ అండ్‌ అవాయిడెన్స్ కెమెరా కూడా ఉంది. ఇలా ల్యాండర్‌ లో మొత్తంగా ఆరు పేలోడ్ లు ఉన్నాయన్నమాట. ల్యాండర్‌ లెగ్‌, రోవర్‌ ర్యాంప్‌ (ప్రైమరీ, సెకండరీ), రోవర్‌, ఐఎల్‌ఎస్‌ఏ, రాంభా, చాస్టే పేలోడ్‌ లతో పాటు వీటన్నింటిని కమ్యునికేట్ చేసే సురక్షిత వ్యవస్థ, ఎక్స్‌ బ్యాండ్‌ యాంటెన్నాలున్నాయి.
ఇక విక్రమ్ ల్యాండర్‌ లో పంపించిన రోవర్‌ పేరు ప్రగ్యాన్‌. దీని బరువు 26 కిలోలు. మొత్తం ఆరు చక్రాల సహాయంతో చంద్రుడి ఉపరితలంపై తిరుగుతూ 14 రోజులు పనిచేస్తుంది. ఇందులో రెండు పేలోడ్‌లు ఉన్నాయి. మొదటిది లేజర్‌ ఇండ్యూస్డ్‌ బ్రేక్‌డౌన్‌ స్పెక్ట్రోస్కోప్‌ (LIBS). ఇది గుణాత్మక, నిర్మాణాత్మక మూలకాలను విశ్లేషించనుంది.

ఈ పరికరంలో ఉన్న లేజర్‌ రేస్ చంద్రుడిపై ఉన్న మట్టిపై పడుతుంది. అలా మట్టిని కరిగించడం ద్వారా అందులో ఉన్న రసాయన మూలకాలతో పాటు మినరల్స్ ను గుర్తించనుంది.
రెండవది ఆల్ఫా పార్టికల్‌ ఎక్స్‌-రే స్పెక్టోమీటర్‌ (APXS). ఇది  ల్యాండింగ్‌ అయిన ప్రదేశంలోని మట్టి, రాళ్లలో ఉన్న కెమికల్స్ ను గుర్తిస్తుంది. సిలికాన్‌, పొటాషియం, కాల్షియం, టైటానియం, మెగ్నీషియం, అల్యూమినియం వంటి మూలకాలను గుర్తించనుంది. Chandrayaan-3 Successfully Landed on the Moon.


Comment As:

Comment (0)