sharmila

షర్మిలకు కారును గిఫ్ట్‌గా ఇచ్చిన కమల్‌ హాసన్

 

కోయంబత్తూర్- షర్మిల (Sharmila) కు ప్రముఖ నటుడు కమల్ హాసన్ (kamal Hasan) కారును బహుమతిగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఎంతకీ ఎవరీ షర్మిల అనుకుంటున్నారా? వివరాల్లోకెళ్తే.. డీఎంకే (DMK) నేత, ఎంపీ కనిమొళి (kanimozhi) ఇటీవల తమిళనాడులోని కొయంబత్తూర్‌ (coimbatore) లో గాంధీపురం నుంచి పీలమేడు వరకు ప్రైవేట్‌ సంస్థకు చెందిన బస్సులో ప్రయాణించింది. ఈ బస్సును నడుపుతోన్న షర్మిల అనే మహిళా డ్రైవర్‌ ప్రతిభను మెచ్చుకోవడంతో పాటు ఆమెకు చేతి గడియారాన్ని బహూకరించింది కనిమొళి. ఈ క్రమంలో బస్సులో ట్రైనింగ్ లో ఉన్న మహిళా కండక్టర్‌ ఎంపీ కనిమొళిని టిక్కెట్ తీసుకొమ్మని చెప్పింది. 

దీనికి బస్ డ్రైవర్ షర్మిల అభ్యంతరం చెప్పడంతో వివాదం చెలరేగింది. ఎంపీ కనిమొళితో కండక్టర్ అనుచితంగా ప్రవర్తించిందంటూ షర్మిల తన యాజమాన్యానికి కంప్లైంట్ చేసింది. దీంతో తన పాపులారిటీ కోసం బస్సులో ప్రయాణించేందుకు రెగ్యులర్ గా సెలబ్రిటీలను ఆహ్వానిస్తూ.. బస్సులో సాధారణ ప్రయాణికులను అసౌకర్యానికి గురిచేస్తోందని ఆ కండక్టర్‌ కూడా షర్మిలపై ఫిర్యాదు చేసింది. ఇద్దరి కంప్లైంట్స్ పై విచారించిన యాజమాన్యం బస్ డ్రైవల్ షర్మిలను ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ అంశం వివాదాస్పదంగా మారింది.  

ఈ విషయం తెలుసుకున్న నటుడు కమల్ హాసన్ కొయంబత్తూర్‌ తొలి మహిళా బస్సు డ్రైవర్‌ షర్మిల అంశం చర్చనీయాంశం కావడం తనను ఎంతో బాధించిందని అన్నారు. యువతకు షర్మిల ఎంతో స్ఫూర్తిగా నిలిచిందని.. షర్మిల కేవలం డ్రైవర్‌ గానే మిగిలిపోకూడదని వ్యాఖ్యానించారు. ఎంతో మంది షర్మిలలను సృష్టించాలనేది తన విశ్వాసమన్న కమల్‌ హాసన్.. తన కల్చరల్‌ సెంటర్‌ తరఫున షర్మిలకు ఓ కారును బహుమతిగా ఇస్తున్నట్లు ప్రకటించారు. కేవలం క్యాబ్‌ సర్వీసులకే పరిమితం కాకుండా మరెంతో మందికి ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తగా ఎదిగేందుకు ఈ కారును షర్మిల ఉపయోగించుకోవాలని కమల్ హాసన్ పేర్కొన్నారు. 
.

.


 


Comment As:

Comment (0)