Jagan Bharati

ఎన్నికలు అవ్వగానే విదేశీ పర్యటనకు సీఎం జగన్, భారతి

విజయవాడ రిపోర్ట్- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) విదేశీ పర్యటనకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. యూరప్ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జగన్. మే 17 నుంచి జూన్ 1 వరకు యూరప్ వెళ్లేందుకు హైదరాబాద్ నాంపల్లి కోర్టును అనుమతి కోరారాయన. దీంతో ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు సీబీఐని ఆదేశించినట్లు సమాచారం. సీబీఐ కోర్టు నుంచి అనుమతి వస్తే నెల 17 లేదా 18 యూరప్ ట్రిప్ వెళ్లాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ చదువుకుంటున్న కూతుళ్లతో కొన్ని రోజులు గడపాలని జగన్, భారతి వెళ్తున్నారు. ఈ నెల 30 లేదా జూన్ 1 తిరిగి విజయవాడ వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్కి ఫలితాలకు మధ్య 20 రోజుల సమయం ఉండటంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశీ పర్యటన ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం.


Comment As:

Comment (0)