BRS Manifesto

ఎన్నికల హామీలను ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్

బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటించిన సీఎం కేసీఆర్‌

తెలంగాణ భవన్- ప్రజల ఆశీర్వాదంతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే ఎన్నికవుందని బలంగా నమ్ముతున్నామని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇవ్వని హామీలను సైతం అమలు చేసిన ఘనత తమదేనని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్‌ విజయం సాధించడమే లక్ష్యంగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను తెలంగాణ భవన్ లో ప్రకటించారు.


బీఆర్ఎస్ మేనిపెస్టోలోని (BRS Manifesto) ప్ఱధానమైన అంశాలు... కేసీఆర్ మాటల్లోనే

తెలంగాణలో తెల్ల రేషన్‌ కార్డు ఉన్న కుటుంబాలన్నింటికీ రైతు బీమా తరహాలో కేసీఆర్‌ బీమా అమలుచేస్తాం. రాష్ట్రంలో 93 లక్షల కుటుంబాలకు కేసీఆర్‌ బీమా-ఇంటింటికీ ధీమా పథకంతో లబ్ది చేకూరుతుంది. 5లక్షల రూపాయల బీమాను ఎల్‌ఐసీ సంస్థ ద్వారా అమలు చేస్తాము. 

సౌభాగ్య లక్ష్మి పథకం కింద అర్హులైన పేద మహిళలకు ప్రతి నెల 3వేల రూపాయల చొప్పున గౌరవ భృతి అందిస్తాం. 

అర్హులైన, అక్రిడేషన్‌ ఉన్న ప్రతి జర్నలిస్టుకు 400 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తాం.

ఆసరా పింఛన్లు 3 వేలకు పెంపు. దశల వారీగా ఆసరా పింఛన్లు మొత్తాన్ని పెంచుతాం. ప్రతి సంవత్సరం 500ల చొప్పున పెంచుతూ 5వేలకు పెంచుతాం.

దివ్యాంగులకు పింఛను 6వేల రూపాయలకు పెంపు. దివ్యాంగుల పింఛను మొదటి ఏడాది 5వేలకు పెంపు. ప్రతి సంవత్సరం 300ల చొప్పున పెంచుతూ 6 వేలు ఇస్తాము. 

రైతు బంధు మొత్తాన్ని 16వేలకు పెంచుతాం.  మొదటి సంవత్సరం 12వేల రూపాయల వరకు పెంపు. 

తెల్ల రేషన్‌ కార్డు ఉన్న కుటుంబాలకు తెలంగాణ అన్నపూర్ణ పథకం ద్వారా సన్న బియ్యం అందజేస్తాం. 

దళిత బంధు, రైతు బీమా కొనసాగిస్తాం..

 


Comment As:

Comment (0)