Annavaram

వివాదాస్పద నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత

అన్నవరంలో పెళ్లి జరిపించాలంటే ధ్రువపత్రం కావాల్సిందే

కాకినాడ రిపోర్ట్- ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం (Annavaram) దేవస్థానం అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాలకు తావిస్తున్నాయి. అన్నవరం దేవస్థానం జారీచేసిన అనుమతి పత్రం పొందితేనే వివాహాలు చేయించడానికి వచ్చే బ్రాహ్మణులు, డోలు, సన్నాయి వాయిద్యకారులను అనుమతిస్తామని అధికారులు శుక్రవారం ఉదయం ఓ ప్రకటన విడుదల చేశారు. తమ ఆధార్‌ కార్డు, కుల ధృవీకరణ పత్రం, విద్యార్హత, పాండిత్య, గెజిటెడ్‌ అధికారి జారీ చేసిన సత్ప్రవర్తన, పురోహిత సంఘం జారీచేసిన ధ్రువీకరణ పత్రాలు, వాయిద్యకారులైతే అదనంగా వారి సొంత వాయిద్య పరికరంతో ఫొటో తదితర ధ్రువీకరణ పత్రాలతో పాటు నిర్ధారణ రుసుంగా 2 వేలు చెల్లించి గుర్తింపుకార్డు పొందాలని ఆదేశాలిచ్చారు.

ఈ కార్డు ఉంటేనే కొండపై శుభకార్యాలు నిర్వహించేందుకు అనుమతిస్తామని ఆదేశాల్లో స్పష్టం చేశారు దేనస్థానం అధికారులు. అన్నవరం దేవస్థానం చేసిన ప్రకటన వివాదాస్పదమైంది. దీంతో వెంటనే తేరుకున్న దేవస్థానం అధికారులు ఈ నిర్ణయాన్ని కొన్ని రోజులు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అన్నవరం దేవస్థానం వ్యవహార శైలి ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. annavaram satyanarayana swamy temple


Comment As:

Comment (0)