Shanti Swaroop

తొలి తెలుగు న్యూస్‌ రీడర్‌ శాంతి స్వరూప్‌ ఇక లేరు

హైదరాబాద్ రిపోర్ట్- మొట్టమొదటి తెలుగు న్యూస్‌ రీడర్‌ శాంతి స్వరూప్ (Shanti Swaroop) (74) ఇక లేరు. గుండె పోటుతో రెండు రోజుల క్రితం హైదరాబాద్ లోని యశోదా ఆస్పత్రిలో చేరిన శాంతి స్వరూప్.. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. తెలుగులో తొలిసారి వార్తలు చదివిన శాంతి స్వరూప్ తెలుగు వారి గుండెళ్లో చెరగని ముద్రవేశారు. మొత్తం పది సంవత్సరాల పాటు టెలీప్రాంప్టర్‌ లేకుండా పేపర్‌ చూసి చెప్పేవారు శాంతి స్వరూప్

1983 నవంబర్ 14 నుంచి దూరదర్శన్‌లో వార్తలు చదవడం ప్రారంభించిన శాంతి స్వరూప్.. ఆ తరువాత తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని సెలబ్రెటీ అయిపోయారు. దూరదర్శన్‌ లో 2011లో పదవీ విరమణ చేసేవరకు పనిచేశారు. శాంతి స్వరూప్‌ కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. శాంతి స్వరూప్ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డతో పాటు మరెన్నో అవార్డులు అందుకున్నారు. శాంతి స్వరూప్ మృతిపట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు దిగ్భాంతి వ్యక్తం చేశారు.


Comment As:

Comment (0)