CBI Nageshwar Rao

గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును ఎలా అరెస్ట్ చేస్తారు?

అమరావతి రిపోర్ట్- గవర్నర్ అనుమతి లేకుండా టీడీపీ (TDP) అధినేత చంద్రబాబును (Chandrababu) అరెస్ట్ చేసి విచారించడం చట్ట విరుద్ధమని సీబీఐ (CBI) మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు (Nageshwar Rao) అన్నారు. ఇందుకు గవర్నర్ అనుమతి అవసరమని చట్టం చెబుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఈ విషయంలో గందరగోళం నెలకొంది. గవర్నర్ అనుమతి ఇస్తే గనుక ఆ పేపర్లు చూపించాలని నాగేశ్వరరావు అన్నారు. గవర్నర్ అనుమతి ఇవ్వకుంటే విచారణకు లెక్కే లేదని స్పష్టం చేశారు. గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేసి, విచారణ నిర్వహిస్తే అది చట్ట విరుద్ధమని ఆయన అన్నారు. అలా చేసిన పోలీసు అధికారులకు కూడా ఇబ్బందులు తప్పవని నాగేశ్వరరావు హెచ్చరించారు.


Comment As:

Comment (0)