ACB Court Chandrababu

చంద్రబాబు కస్టడీ పిటీషన్ తీర్పుపై ఉత్కంఠ

చంద్రబాబు సీఐడీ కస్టడీ పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. గురువారం 11.30కి తీర్పు

అమరావతి రిపోర్ట్- ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును (Chandrababu) కస్టడీకి కోరుతూ సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్‌ పై విజయవాడ ఏసీబీ కోర్టులో (Vijayawada ACB Court) బుధవారం విచారణ ముగిసింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి గురువారం ఉదయం 11.30 గంటలకు తీర్పు వెలువరిస్తామని చెప్పారు. చంద్రబాబును ఐదు రోజుల పాటు కస్టడీకి కోరుతూ సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబును అన్ని ఆధారాలతోనే అరెస్టు చేశారని వాదించారు. చంద్రబాబు తరపున సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ్‌ లూథ్రా, సిద్ధార్థ్‌ అగర్వాల్‌ లు ఏసీబీ కోర్టు న్యామూర్తి ముందు వాదనలు వినిపించారు. చంద్రబాబును కోర్టులో హాజరుపరిచిన సెప్టెంబరు 10న సీఐడీ కస్టడీ కోరలేదని, మరుసటి రోజు సెప్టెంబరు 11న కస్టడీకి కోరుతూ మెమో ఎలా దాఖలు చేస్తారని తమ వాదన వినిపించారు. 

కేవలం 24 గంటల్లో దర్యాప్తు అధికారి నిర్ణయం మార్చుకున్నారని, పాత అంశాలతో చంద్రబాబును కస్టడీకి ఎలా కోరతారని కోర్టు దృష్టికి తెచ్చారు. చంద్రబాబు అరెస్టు ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని, చంద్రబాబు అవినీతి చేసినట్టు ఎక్కడా ఆధారాల్లేవని వాదించారు. చంద్రబాబును అరెస్టు చేసి విచారణ పేరుతో సీఐడీ ఆఫీసులో ఉంచారు.. కొన్ని గంటల పాటు చంద్రబాబును విచారించారు. ఆయన నుంచి అన్ని విషయాలు రాబట్టామని చెప్పి, మళ్లీ కస్టడీకి ఎందుకు అడుగుతున్నారని కోర్టు ముందు వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి గురువారం ఉదయం 11.30 గంటలకు తీర్పు వెలువరిస్తామని చెప్పారు. 


Comment As:

Comment (0)