Chandrayaan-3 Telangana

ఇళ్లలోనే వీక్షించేలా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలన్న విద్యాశాఖ

చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌.. స్కూల్స్ టైమింగ్స్ లో మార్పు లేదు

తెలంగాణ రిపోర్ట్- భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) ప్రయోగించిన చంద్రయాన్‌-3 (Chandrayaan-3) చందమామపై బుధవారం సాయంత్రం అడుగుపెట్టబోతోంది. ఈ అద్వితీయమైన ఘట్టాన్ని విద్యార్థులు వారి వారి ఇళ్లల్లోనే వీక్షించేలా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని తెలంగాణ విద్యాశాఖ విజ్ఞప్తి చేసింది. చంద్రయాన్‌-3 ల్యండింగ్ ను వీక్షించేందుకు వీలుగా రాష్ట్రంలోని అన్ని స్కూల్స్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, సాయంత్రం 6.30 గంటల వరకు విద్యార్థులు పాఠశాలల్లోనే ఉండేలా విద్యాశాఖ చర్యలు చేపట్టాలని డీఈవోలు, ప్రిన్సిపాళ్లకు విద్యాశాఖ ముందు ఆదేశాలిచ్చింది.

కానీ కాసేపటికే విద్యాశాఖ తన ఆదేశాలను ఉపసంహరించుకుని చంద్రయాన్ -3 కోసం పాఠశాల వేళల పొడిగింపు లేదని స్పష్టం చేసింది. చంద్రుడి ఉపరితలంపై విక్రమ్‌ దిగే సాఫ్ట్‌ ల్యాండింగ్‌ ప్రక్రియను గురువారం అన్ని పాఠశాలల్లో యూట్యూబ్‌ లో విద్యార్థులకు ప్రదర్శించాలని, తరగతి గదుల్లో దీనిపై వారితో చర్చ నిర్వహించాలని తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. దీంతో తెలంగాణలోని పాఠశాలలో వేళల్లో ఎలాంటి మార్పు లేదని తెలిపోయింది. Telangana Education Department 
 


Comment As:

Comment (0)