BRS Office

తెలంగాణ భవన్ కు గెట్లు మారుస్తున్న నేతలు

బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వాస్తు దోష నివారణ

హైదరాబాద్ రిపోర్ట్- మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్ఎస్ పార్టీ ఓటమికిగల కారణాలపై విశ్లేషన చేసుకుంటోంది. ఇందుకు సవాలక్ష కారణాలున్నా.. అందులో పార్టీ ప్రధాన కార్యాలయం ఉన్న తెలంగాణ భవన్ కు ఉన్న వాస్తు దోషం కూడా ఒక కారణమని బీఆర్ఎస్ నేతలు అధినేత కేసీఆర్ కు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఏ మాత్రం ఆలస్యం చేసకుండా తెలంగాన భవన్ కు వాస్తు దోషాలను సరిచేసే పనిలో పడ్డారు బీఆర్ఎస్ నేతలు. ఈ మేరకు బీఆర్ఎస్రాష్ట్ర కార్యాలయానికి వాస్తు సరిచేయడంలో భాగంగా ఈశాన్యం వైపు గేటును పూర్తిస్థాయిలో తెరిచారు. ఇకపై గేటులోంచే నేతల రాకపోకలు సాగించనున్నారని చెబుతున్నారు.

బంజారాహిల్స్ లో ఉన్న తెలంగాణ భవన్ఉత్తరం దిక్కుగా ఉంది. కార్యాలయంలోకి వాహనాలు, నేతలు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు లోపలికి ప్రవేశించేందుకుగాను ప్రధాన గేటును పడమర వాయవ్య దిశగా ఉంటుంది. ఈ రోజు వరకు తెలంగాణ భవన్ కు రాకపోకలన్నీ గేటు ద్వారానే సాగాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పరజయం తరువాత పార్టీ కార్యాలయానుకు వాస్తుపరంగా సరికాదనే భావనతో తూర్పు ఈశాన్యం వైపు ఉన్న గేటును పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తున్నారు. గేటును ఇంతకు ముందు లాంఛనంగా ఏర్పాటు చేసినా పెద్దగా ఉపయోగంలో లేదు.

ఇక ఇప్పుడు వాస్తు దోషనివారణలో భాగంగా ఈ గేటులోంచి రాకపోకలకు అనువుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వాహనాలు లోపలికి వచ్చేందుకు వీలుగా గేటు వద్ద ర్యాంపును నిర్మిస్తున్నారు. అంతే కాదు తూర్పు వైపు వాహనాల పార్కింగ్అనువుగా ఉంటుందనే ఉద్దేశంతో అక్కడే ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు తూర్పు ఈశాన్యం గేటు దగ్గర వీధి పోటును దృష్టిలో పెట్టుకుని అక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఫోటోతో భారీ ఫ్లెక్సీని కూడా గేటుకు ఏర్పాటు చేశారు. మరి ఈ వాస్తు మార్పులు ఏ మేరకు లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు కలిసివస్తుందో చూడాలి అని అనుకుంటున్నారట నేతలు.


Comment As:

Comment (0)