Woman Missing

బాలికలు, మహిళల అదృశ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

తెలంగాణ, ఏపీలో 72,767 మంది బాలికలు, మహిళలు అదృశ్యం

నేషనల్ రిపోర్ట్- తెలంగాణ (Telangana) , ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) రాష్ట్రాల్లో బాలికలు, మహిళల అదృశ్యంపై (Woman Missing) కేంద్ర ప్రభుత్వం (Central Govt కీలక ప్రకటన చేసింది. రాజ్యసభ (Rajyasabha) లో మహిళల అదృశ్యంపై పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా (Ajay Mishra) ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం వేలమంది బాలికలు, మహిళలు అదృశ్యమవుతున్నారని హోంశాఖ తెలిపింది. గత మూడేళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 72,767 మంది అదృశ్యం అయినట్టు పార్లమెంట్‌ కు నివేదించింది హోంశాఖ. వీరిలో 15,994 బాలికలు, 56,773 మంది మహిళలు ఉన్నట్టు తెలిపింది. జాతీయ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో లెక్కల ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మహిళలు అదృశ్యమవుతున్న కేసులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయని కేంద్రం నివేదికలో స్పష్టం చేసింది.

గత మూడేళ్లలో 2019 నుంచి 2021 వరకు తెలంగాణలో 8,066 మంది బాలికలు, 34,495 మహిళలు అదృశ్యం అయ్యారని కేంద్రం ప్రకటించింది.  
2019 లో 2,849 మంది బాలికలు, 10,744 మంది మహిళలు
2020 లో 2,232 మంది బాలికలు, 10,917 మంది మహిళలు
2021 లో 2,994 మంది బాలికలు, 12,834 మంది మహిళలు అదృశ్యం అయ్యారని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించింది.

ఇక ఆంధ్రప్రదేశ్ లో మూడేళ్లలో 2019 నుంచి 2021 వరకు మొత్తం 7,928 మంది బాలికలు, 22,278 మహిళలు అదృశ్యమయ్యారని కేంద్రం తెలిపింది.  
2019 లో 2,186 మంది బాలికలు, 6,252 మంది మహిళలు
2020 లో 2,374 మంది బాలికలు, 7,057 మంది మహిళలు
2021 లో 3,358 మంది బాలికలు, 8,969 మంది మహిళలు అదృశ్యం అయినట్లు కేంద్ర హోంశాఖ రాజ్యసభలో వెలువరించిన నివేధికలో పేర్కొంది.
 


Comment As:

Comment (0)