Wooden Box

పెట్టెను చూసేందుకు బారులు తీరిన జనం

విశాఖ సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన బ్రటీష్ కాలం పెట్టె

విశాఖపట్నం రిపోర్ట్- వైజాగ్ లో సముద్ర తీరానికి కొట్టుకువచ్చిన పురాతన బాక్స్ కొంతసేపు అందరిని భయబ్రాంతులకు గురిచేసింది. శుక్రవారం విశాఖపట్నం (Visakhapatnam) సాగర తీరానికి ఓ భారీ పెట్టె కొట్టుకొచ్చింది. దీని బరువు సుమారు వంద టన్నుల వరకు ఉంది. పురాతనమైన చెక్క పెట్టె కావడంతో ప్రొక్లెయిన్‌ సహాయంతో ఒడ్డుకు చేర్చారు. విశాఖపట్నం వైఎంసీఏ బీచ్‌కు కొట్టుకువచ్చిన భారీ ఆకృతిలోని ఈ చెక్క పెట్టె బ్రిటీష్ కాలం నాటిదిగా ముందు అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ఆర్కియాలజీ విభాగానికి సమాచారం ఇచ్చారు.

దీంతో ఆ పెట్టెలో ఏముందనే ఉత్కంఠ నెలకొంది. ఈ చెక్కపెట్టెను (Wooden Box) పగలకొట్టడంతో అందరిలోని ఉత్కంఠకు తెరపడింది. బాంబు స్క్వాడ్‌ పర్యవేక్షణలో 2 ప్రొక్లెయిన్‌ లతో అధికారులు ఈ బారీ పెట్టేను పగలకొట్టారు. ఇందులో 50 వరకు కర్ర దూలాలు ఉన్నాయి. పెద్ద పెద్ద షిప్పుల్లో లంగర్ కోసం వీటిని ఉపయోగిస్తున్నట్లు అక్కడి జాలర్లు చెప్పారు. వైఎంసీఏ బీచ్‌ లో ఉన్న సందర్శకులు ఆ భారీ పెట్టెను చూసేందుకు ఎగబడ్డారు. వారిని కట్టడి చేయడానికి పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. మొత్తానికి పెట్టెలో దూలాలం మాత్రమే ఉండటంతో పోలీసులు, ధికారులు ఊపిరిపీల్చుకున్నారు.


Comment As:

Comment (0)