Vishal

కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్న నటుడు విశాల్

చెన్నై రిపోర్ట్- ప్రముఖ తమిళ నటుడు విశాల్‌ (Actor Vishal) తన రాజకీయ రంగప్రవేశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో జరిగిన మీడియా సమావంశంలో పాల్గొన్న విశాల్.. త్వరలోనే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని అన్నారు. పొలిటికల్ పార్టీని స్థాపించి 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. ప్రస్తుతం ప్రజలకు సరైన వసతుల్లేవన్న విశాల్.. వారికి సేవ చేసి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతోనే పాలిటిక్స్ లోకి అడుగుపెడుతున్నట్లు తెలిపారు. ఇప్పుడు విశాల్ రాజకీయ పార్టీ ప్రకటన తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.


Comment As:

Comment (0)