Kajol

సోషల్ మీడియా వీడియోపై బాలీవుడ్ లో కలవరం

బాలీవుడ్ నటి కాజోల్ డ్రెస్‌ ఛేంజింగ్ వీడియో అంటూ ప్రచారం.. 

మూవీ రిపోర్ట్- బాలీవుడ్‌ సీనియర్ నటి కాజోల్‌ (Kajol) పై డీప్‌ ఫేక్‌ వీడియో క్రియేట్‌ చేయడం సినీ పరిశ్రమను కలవరానికి గురిచేస్తోంది. గెట్‌ రెడీ విత్‌ మీ.. అంటూ ఓ సోషల్‌ మీడియా నటి పోస్ట్‌ చేసిన వీడియోకు కాజోల్‌ ముఖాన్ని ఉపయోగించి గుర్తుతెలియని వ్యక్తి ఫేక్‌ వీడియో సృష్టించారు. నటి కాజోల్ డ్రెస్‌ ఛేంజింగ్‌ వీడియో అంటూ దీనిని సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో బాలీవుడ్ నటీనటులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఫేక్‌ వీడియోలతో సినిమా స్టార్స్ ను టార్గెట్‌ చేయడంపై నెటిజెన్స్ సైతం నిరసన తెలుపుతున్నారు. జూన్‌ నెలలో టిక్‌ టాక్‌ వేదికగా ఓ సోషల్‌ మీడియా నటి దీనిని పోస్ట్ చేయగా, ఆ వీడియోను ఉపయోగించి నటి కాజోల్‌ ఫోటోతో ఈ వీడియో చేశారని తెలుస్తోంది.

 


Comment As:

Comment (0)