JP Nadda

అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తాం

అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తాం

 తెలంగాణలో ఒకే ఒక కుటుంబం బాగుపడింది
కేంద్రం ఇచ్చిన ఇళ్ల పధకంలో కుంభకోణం జరిగింది 
తెలంగాణలో సీఎం కేసీఆర్‌ ను జైలుకు పంపాలి
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 

నాగర్ కర్నూల్- బీజేపీ (BJP) జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా (JP Nadda) తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. బీఆర్ ఎస్ (BRS) అంటే అవినీతి (భ్రష్టాచార్‌) రాక్షసుల సమితి నడ్డా కామెంట్ చేశారు. మహా జన్‌ సంపర్క్‌ అభియాన్‌ లో భాగంగా నాగర్‌ కర్నూల్‌ జిల్లా కేంద్రంలో ఆదివారం బీజేపీ నవ సంకల్ప సభ నిర్వహించింది. ఈ భహిరంగ సభకు జేపీ నడ్డా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కేసీఆర్‌ (KCR) తన కుటుంబాన్ని కాపాడుకునేందుకే టీఆర్ ఎస్ (TRS) ను బీఆర్ ఎస్ గా మార్చారని నడ్డా వ్యాఖ్యానించారు. రైతుల భూములను లాక్కునేందుకు, కార్యకర్తల జేబులు నింపేందుకే ధరణి పోర్టల్‌ తీసుకొచ్చారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని నడ్డా ప్రకటించారు. 

రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, కుటుంబ పాలన పోవాలన్నా బీజేపీ అధికారంలోకి తీసుకురావాలని ప్రజలకు విన్నవించారు నడ్డా. తెలంగాణ సాధించుకునేందుకు ఎందరో యువకులు బలిదానాలు చేశారని, అమరుల త్యాగాలతో సాధించుకున్న రాష్ట్రం వెనకబాటుకు గురవ్వగా.. కేవలం ఒకే ఒక కుటుంబం బాగుపడిందని జేపీ నడ్డా అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఆయన కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత మాత్రమే లాభపడ్డారని కామెంట్ చేశారు. 

రైతులు, యువత, పేదల సంక్షేమం, వారు ఆకాంక్షలను పక్కనపెట్టి తన కుటుంబానికే కేసీఆర్‌ పెద్దపీట వేశారని మండిపడ్డారు. తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సర్వనాశనం చేశారని అన్నారు. ఆవాస్‌ యోజన కింద దేశంలో నాలుగు కోట్ల కుటుంబాలకు ఇళ్లు నిర్మించామని చెప్పిన నడ్డా.. తెలంగాణకు 2.50 లక్షల ఇళ్లు మంజూరు చేశామని గుర్తు చేశారు. అందులో పెద్దఎత్తున కుంభకోణం జరిగింది. ఈ వ్యవహారంలో సీఎం కేసీఆర్‌ను జైలుకు పంపించాలని వ్యాఖ్యానించారు.


Comment As:

Comment (0)