Jagan

మీరు ఏం చెప్పినా వినడానికి సిద్ధంగా ఉన్నాను. 

ఏపీ సీఎం జగన్ జేబులోంచి పెన్ను తీసుకున్న పాప

కాకినాడ రిపోర్ట్-  ఏపీ సీఎం వైఎస్ జగన్ (AP CM Jagan) కు వింత ఘటన ఎదురైంది. మంగళవారం కోనసీమలో వరద ప్రభావి ప్రాంతాల్లో పర్యటించిన జగన్ అక్కడ ఓ చిన్న పాపను ఎత్తుకున్నారు. ఆ పాప జగన్ జెబులోని పెన్ను తీసుకోవడానికి ప్రయత్నించింది. దీంతో వెంటనే ఆ ఖరీదైన పెన్నును సీఎం ఆ పాపకు ఇచ్చేశారు. ఈ ఘటన కాసేపు సరదాగా సాగింది. 

మీరు ఏం చెప్పినా వినడానికి సిద్ధంగా ఉన్నాను.. పొరపాట్లు ఉంటే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాని అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం, అయినవిల్లి మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం సీఎం పర్యటించారు. ప్రభుత్వ యంత్రాంగం స్పందించకపోతే మా దృష్టికి తీసుకురండి.. నేను బాధ్యత తీసుకుంటానని వరద బాధితులకు భరోసా ఇచ్చారు. 

రాజమహేంద్రవరం నుంచి హెలికాప్టర్‌ లో ముమ్మిడివరం మండలం గురజాపు లంక చేరుకున్న సీఎం జగన్, అక్కడ వరద బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ కూనలంకలో వృద్ధ గౌతమీ గోదావరి నదీ కోతను పరిశీలించారు. పంట నష్టాన్ని పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. కూనలంక, లంక ఆఫ్‌ ఠాణేలంక, కొండుకుదురు లంక శివారు తొత్తరమూడివారిపేట గ్రామాల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితిలో మార్పు తెచ్చామని చెప్పారు. వేగంగా, పారదర్శకంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా మీ బిడ్డ పరిపాలనలో మార్పులు జరుగుతున్నాయని అన్నారు. సచివాలయ, వాలంటీరు, విలేజి క్లినిక్‌ వ్యవస్థలు గ్రామ స్థాయికి తెచ్చామని తెలిపారు.
 


Comment As:

Comment (0)