బాలయ్య బాబు అదరగొట్టేశాడు

బాలకృష్ణ భగవంత్‌ కేసరి ట్రైలర్‌ వచ్చేసింది

మూవీ రిపోర్ట్- నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna) అభిమానులు, సినీ ప్రియులంతా ఎప్పుడెప్పుడా  అని ఇంట్రస్టింగ్ గా ఎదురు చూసిన భగవంత్‌ కేసరి (Bhagavanth Kesari) ట్రైలర్‌ విడుదలైంది. నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. అన్నట్లు భగవంత్‌ కేసరి ఈ నెల 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్బంగా చిత్ర బృందం వరంగల్‌ లో నిర్వహించిన వేడుకలో భగవంత్‌ కేసరి  ట్రైలర్‌ (Bhagavanth Kesari Trailer) లాంచి చేసింది. మరింక ఆలస్యం ఎందుకు చెప్పండి.. మీరు కూడా భగవంత్‌ కేసరి ట్రైలర్ చూసేయండి.. జై బాలయ్య.


Comment As:

Comment (0)