Ramwshwaram

బెంగళూరు రామేశ్వరం కెఫే బ్లాస్ట్‌ కీలక నిందితుడు ఆరెస్ట్

కర్ణాటక రిపోర్ట్- బెంగళూరులోని రామేశ్వరం కెఫే (Rameshwaram Cafe) బాంబు పేలుడు కేసు దర్యాప్తులో పురోగతి కనిపిస్తోంది. నేషనల్ ఇన్వెస్తింగ్ ఎజెన్సీ-ఎన్ఐఏ బాంబు పేలుడుకు సంబందించిన ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్ట్ చేసింది. బాంబర్ ముస్సావిర్ హుస్సెన్‌ షాజిబ్‌ (Mussavir Hussain Shahib), సూత్రధారి అబ్దుల్ మతీన్‌ తాహాను (Abdul Mateen Taha) ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. బెంఘళూరులో బాంబు పేలుడు జరిగిన రోజు నుంచి పరారీలో ఉన్న ఈ తీవ్రవాదులిద్దరు పశ్చిమ్‌ బెంగాల్‌, అసోంలో తలదాచుకున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది.

గత నెల మార్చిలో బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్‌లో ఉన్న రామేశ్వరం కెఫేలో బాంబు పేలిన ఘటనలో మొత్తం 9 మంది గాయపడ్డారు. కేసును కర్ణాటక హోంశాఖ ఎన్‌ఐఏకు అప్పగించిందిఈ పెలుడుకు సంబందించి నిందితుడు ఆర్‌డీఎక్స్‌ ఉపయోగించాడని నిపుణులు గుర్తించారు. ఈ పెలుడు ఘటనపై సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఎన్ఐఏ విచారణ చేపట్టింది. బాంబర్‌ కెఫేలో అనుమానాస్పదంగా తిరుగుతూ రవ్వ ఇడ్లీ తిని తనతో తెచ్చిన పేలుడు పదార్థాలున్న బ్యాగ్ ను అక్కడపెట్టి హడావుడిగా వెళ్లినట్లు సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు.

రామేశ్వరం  కెఫే కు ఐదు కిలోమీటర్ల పరిధిలోని కొన్ని వందల సీసీ కెమెరాల ఫుటెజ్ ని విశ్లేషించింది ఎన్ఐఏ. క్యాప్ పెట్టుకున్న వ్యక్తి నోటికి మాస్కు కట్టుకుని నల్ల బూట్లు, అదే రంగు ప్యాంటు ధరించి ఉన్నట్లు గుర్తించారు. దీంతో క్యాప్ ఆధారంగా పోలీసులు విచారణ మొదలుపెట్టి.. వారు క్యాప్ ను కొంటున్నప్పటి దృశ్యాలను కనుగొన్నారు. దీంతో బాంబు పేలుడుకు సంబందించిన ఇద్దరు కీలక నిందితులను గుర్తించి అరెస్ట్‌ చేసింది ఎన్ఐఏ


Comment As:

Comment (0)