Bhagavanth Kesari Review

భగవంత్ కేసరి తెలుగు రివ్యూ

బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమా రివ్యూ

సినిమా- భగవంత్‌ కేసరి (Bhagavanth Kesari Movie Review)

తారాగణం- బాలకృష్ణ, కాజల్‌ అగర్వాల్‌, శ్రీలీల, అర్జున్‌ రాంపాల్‌, ప్రియాంక జవాల్కర్‌, ఆర్‌.శరత్‌కుమార్‌, రఘుబాబు, జాన్‌ విజయ్‌, వీటీవీ గణేష్‌ తదితరులు 

మ్యూజిక్-ఎస్‌. తమన్‌

సినిమాటోగ్రఫీ- సి.రామ్‌ ప్రసాద్‌

ఎడిటింగ్‌- తమ్మిరాజు

నిర్మాతలు- సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది

రచన, దర్శకత్వం- అనిల్‌ రావిపూడి

విడుదల- 19-10-2023

భగవంత్ కేసరి పరిచయం...

సక్సెస్‌తో సంబంధం లేకుండా ప్రయోగాలకు రేడీగా ఉంటారు నందమూరి నట సింహం బాలకృష్ణ. ఆయన సినిమా విడుదలైతే ఇక చెప్పేదేముంది అభిమానులకు పండగే. ఇక యాక్షన్‌కు హాస్యాన్ని మిక్స్ చేసి కథను తెరకెక్కించడంలో అనిల్ రావిపూడి స్టైల్ వేరు. అందుకే ఈ రెండు అంశాలు మేళవించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ దసరా సందర్బంగా 'భగవంత్ కేసరి' సినిమా ద్వారా ప్రజల ముందుకు వచ్చారు బాలయ్య. మరి గురువారం విడుదలైన భగవంత్ కేసరి ఎలా ఉంది, ప్రేక్షకులకు నచ్చిందా..

భగవంత్ కేసరి కధ...

నేలకొండ భగవంత్ కేసరి (Balakrishna) ఒక అడవి బిడ్డ. అనుకోకుండా జరిగిన సంఘటన వల్ల జైలులో ఉన్నప్పుడు, జైలర్ (Sharth Kumar) కుమార్తె విజ్జి పాప (Srileela) విజయలక్ష్మితో పరిచయం కాస్త మంచి అనుబంధంగా మారుతుంది. విజయలక్ష్మిని సైన్యంలో చేరాలన్నది ఆమె తండ్రి కల. ఈ క్రమంలో జైలర్ ప్రమాదవశాత్తు మరణించడంతో, భగవంత్ కేసరి విజ్జి పాప భాద్యతలను తీసుకుంటాడు. ఆమెను ఓ సింహంలా పెంచాలని భగవంత్ కేసరి నిర్ణయించుకుంటాడు. మరి భగవంత్ కేసరి చేసే ప్రయత్నం ఫలిస్తుందా? సైకాలజిస్ట్ కాత్య (Kajal) భగవంత్ కేసరికి ఎలా సహాయం చేస్తుంది? అసలు భగవంత్ కేసరి జైలుకు ఎందుకు వెళ్లాడు? అతని గతం ఏమిటి? ఇదంతా తెలియాలంటే మాత్రం భగవంత్ కేసరి ధియేటర్ లో చూడాల్సిందే..

భగవంత్ కేసరి ఎలా ఉందంటే... (Bhagavanth Kesari Movie Review)

పెద్ద హీరోల సినిమాల్లో వారి అభిమానులను సంతృప్తి పరచడానికి ఈ హీరోల తాలూకు ఇమేజ్‌ని వాడుకుంటే సరిపోతుందని ఫార్ములా సినిమాలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు ఇప్పుడున్న దర్శకులు. ఐతే యువ దర్శకుడు అనిల్ రావిపూడి మాత్రం భగవంత్ కేసరితో సరికొత్త ప్రయత్నం చేశాడు. బాలకృష్ణ లాంటి గొప్ప నటుడు ఆడపిల్లను సింహంలా తీర్చిదిద్దాలనే సంకల్పాన్ని చెప్పించాడు. ప్రస్తుత సమాజంలో చాలా ముఖ్యమైన గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ అనే ముఖ్యమైన అంశాన్ని టచ్ చేసి, దానికి సినిమా అనే శక్తివంతమైన మాధ్యమం అని చాటి చెప్పాడు అనిల్ రావిపూడి. అభిమానులను మరియు కుటుంబ ప్రేక్షకులను మెప్పించే హీరోయిజం భావోద్వేగాలను మరియు వినోదం ఈ సినిమా ద్వార ప్రేక్షకులకు అందిస్తుంది.

(Bhagavanth Kesari Movie Review)

భగవంత్ కేసరి ఫస్ట్ హాఫ్ లో సైకాలజిస్ట్ కాత్యాయని, భగవంత్ కేసరి మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. యూనివర్శిటీలో విజయప్పను భయపెట్టే సన్నివేశం నుండి కథ మొదలవుతుంది. కుటుంబ కథా చిత్రంగా ప్రారంభమైన ఈ సినిమా ఆ తర్వాత యాక్షన్ ధ్రిల్లర్ గా మారుతుంది. అడవిలో కొందరిని చంపే సన్నివేశం, మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు ద్వితీయార్థాన్ని మరింత ఆసక్తికరంగా మారుతాయి. భగవంత్ కేసరి మరియు విజ్జిపాప మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ద్వితీయార్థానికి బలమని చెప్పాలి. సెకండాఫ్‌ లో.. మా అడవిలో జంతువులు ఉన్నాయని నోటీసు బోర్డు రాసి ఉంది.. కానీ సమాజం అలా కాదు, ఆవులా కనిపించే నక్కలు ఉన్నాయి.. జంతువు మనిషిగా మారడం చాలా కష్టం.. అయితే అమ్మాయిని చూస్తే మగవాడు మృగం అవుతాడు అని బాలకృష్ణ చెప్పే డైలాగ్ అందరిని ఆలోచింపజేస్తుంది. బాలకృష్ణ గత చిత్రాలకు భిన్నంగా మంచి సందేశం, భావోద్వేగాలతో కూడిన సినిమా భగవంత్ కేసరి.

(Bhagavanth Kesari Movie Review)

ఇక ఈ సినిమాలో బాలకృష్ణ భిన్నమైన పాత్రలో కనిపించారు. ఆయన నటన, లుక్స్ సినిమాకు హైలైట్. తెలంగాణ యాసలో ఆయన చెప్పే డైలాగ్స్ అందరిని ఆకట్టుకుంటాయి. పోరాట సన్నివేశాలు కూడా ఇతర చిత్రాలకు భిన్నంగా సహజంగా ఉన్నాయి. ఎమోషనల్, యాక్షన్ సన్నివేశాల్లో శ్రీలీల ప్రతిభ ఆకట్టుకుంటుంది. క్రైమాక్స్ సన్నివేశాలతో బాలకృష్ణ, శ్రీలీల నటన అద్భుతం. కాజల్ అగర్వాల్ పాత్రకు పెద్దగా ఆదరణ లేకపోయినా బాలకృష్ణ మాత్రం అందుకు తగ్గట్టుగానే కనిపిస్తారు. రవిశంకర్, శ్రీనివాస్, మురళీధర్ గౌడ్, బ్రహ్మాజీ తదితర నటీనటులు ఇందులో నటించారు. సినిమాటోగ్రఫీ, సంగీతం, ప్రొడక్షన్ డిజైన్ తదితర సాంకేతిక విభాగాలు బాగా పనిచేశాయి. భగవంత్ కేసరి కధను అనిల్ రావిపూడి చెప్పిన తీరు బావుంది. మొత్తానికి భగవంత్ కేసరి సినిమాను ఓ సారి చూసి ఎంజాయ్ చేయవచ్చు.

న్యూస్ పిల్లర్ రేటింగ్-3.5/5

Note- ఇది కేవలం వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.


Comment As:

Comment (0)