Babu Nagari

జగన్ రాజకీయాలకు పనికిరాడు

టీడీపీ అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు- చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రిపోర్ట్- రాష్ట్రంలో యువత కోసం మొత్తం 20లక్షల ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయని టీడీపీ (TDP) జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చిత్తూరు జిల్లా పుత్తూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు మాటట్లాడారు. తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చాక కేవలం 60 రోజుల్లో మెగా డీఎస్సీ పూర్తి చేస్తామని ఈ సందర్బంగా ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చదువుకున్న యువతకు ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా అని చంద్రబాబు ప్రశ్నించారు. యువతకు ఉద్యోగాలు రావాలంటే ఎన్డీయేకు ఓటు వేయాలని ఈ సందర్బంగా పిలుపునిచ్చారు. జగన్ఓ అబద్దాల కోరు అన్న చంద్రబాబు.. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పడంలో ఆయన దిట్ట అని విమర్శించారు. జగన్ రాజకీయాలకు పనికిరాడని.. పేదల మనిషి ఎవరో, పెత్తందారు ఎవరో ప్రజలు తెలుసుకోవాలని కోరారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసమే బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్నామని చెప్పిన చంద్రబాబు.. కేంద్రంలో మళ్లీ బీజేపీ పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

గతంలో తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్లపాటు కరెంట్ ఛార్జీలు పెంచలేదని చంద్రబాబు గుర్తు చేశారు. జగన్ కు పేదల కష్టాలు ఏమాత్రం తెలియవని.. 60 రూపాయల మద్యాన్ని ఏకంగా 200 రూపాయలకు అమ్ముతున్నారని మండిపడ్డారు. పేదల జీవితాల్లో వెలుగులు చూపించే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు చంద్రబాబు. మహిళలను వేధించిన వారు బాగుపడినట్టు చరిత్రలో లేదని అన్నారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా ఆడబిడ్డ నిధి ఇస్తామని చెప్పిన చంద్రబాబు.. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అన్నదాత పధకం కింద రైతులకు ప్రతి సంవత్సరం 20వేలు ఇస్తామని ప్రకటించారు. టీడీపీ అధికారంలోకి రాగానే బీసీలకు 50 ఏళ్లకే పింఛను ఇస్తామని హామీ ఇచ్చారు.


Comment As:

Comment (0)