ISRO Video

చంద్రుడిపై అడుగుపెట్టడానికి ముందు ల్యాండర్ ఇమేజర్ కెమెరా వీడియోను షేర్‌ చేసిన ఇస్రో 

చంద్రయాన్-3 ల్యాండర్‌ దిగుతున్నప్పుడు చందమామను చూశారా

ఇంటర్నేషనల్ డెస్క్- చంద్రయాన్-3 (Chandrayaan 3) ప్రయోగం విజయవంతం కావడంతో ప్రపంచం చూపంతా ఇప్పుడు మన భారత్ వైపు పడింది. ఇప్పటి వరకు ఏ దేశం అడుగుపెట్టని చండ్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి చంద్రయాన్‌-3  చరిత్ర సృష్టించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో (ISRO) పంపిన చంద్రయాన్‌-3 లో విక్రమ్ ల్యాండర్‌ (Vikram Lander) నుంచి బయటకు వచ్చిన ప్రగ్యాన్‌ రోవర్‌ (Pragyan Rover) తన పరిశోధనను మొదలుపెట్టింది. ఈ క్రమంలో తాజాగా ఇస్రో ఓ వీడియోను రిలీజ్ చేసింది. చంద్రయాన్‌ 3 విక్రమ్ ల్యాండర్‌ చంద్రుడిపై ల్యాంజ్ అవుతుండగా దానికి అమర్చిన కెమెరాలో రికార్డు అయిన వీడియోను ఇస్రో షేర్‌ చేసింది.

చందమామపై (Moon Mission) ల్యాండర్‌ దిగడానికి కొన్ని కిలో మీటర్ల ప్రారంభమైన ఈ వీడియో, జాబిల్లిపై అడుగుపెట్టేవరకు కంటిన్యూగా రికార్డయింది. ఇప్పటివరకు విక్రమ్ ల్యాండర్‌ విక్రమ్‌ తీసిన కొన్ని ఫొటోలను మాత్రమే విడుదల చేసిన ఇస్రో, చంద్రుడిపై అడుగుపెట్టడానికి ముందు ల్యాండర్ ఇమేజర్ కెమెరా చందమామ చిత్రాన్ని ఎలా క్యాప్చర్‌ చేసిందో చూడండి.. ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసింది. ఈ వీడియో మొత్తం 2 నిమిషాల 17 సెకన్ల నిడివి ఉంది. మరి ఇంకేందుకు ఆలస్యం ఈ అధ్బుతమైన వీడియోను మీరు కూడా చూసేయండి.


Comment As:

Comment (0)