Kim Jong

ఉత్తర కొరియా నియంత కిమ్‌ కోసం ఏటా 25 మంది అమ్మాయిలు

కిమ్‌ జోంగ్ ఉన్‌ సుఖం కోసం.. సంవత్సరానికి 25 మంది యువతులు

ఇంటర్నేషనల్ రిపోర్ట్- ఉత్తర కొరియా (North Korea) నియంత కిమ్‌ జోంగ్ ఉన్‌ (Kin Jong Un) గురించిన ఆశ్చర్యకరమైన, అంతుపట్టని విషయాలెన్నో వింటుంటాం. అప్పుడప్పుడు కిమ్‌ జోంగ్ ఉన్‌ సంబంధించి సంచలన విషయాలు అంతర్జాతీయ మీడియాలో వస్తుంటాయి. ఇదిగో ఇప్పుడు కిమ్‌ జోంగ్ ఉన్‌ వ్యక్తిగత జీవితానికి సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. కిమ్‌ జోంగ్ ఉన్‌ సంతోష పెట్టడానికి ప్రతి సంవత్సరం 25 మంది యువతుల బృందం పనిచేస్తుందని తెలుస్తోంది. అలా అని ఆశామాషి యులతులు కాదు.. అందం, విధేయత ఆధారంగా వీరిని ఎంపిక చేస్తారట. అంతే కాదు సదరు యువతులకు వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తారట.

కిమ్‌ జోంగ్ ఉన్‌ సంతోష పెట్టే (Pleasure Squad) బృందంగా చెప్పుకునే పనికి గతంలో ఎంపికై, ఉత్తర కొరియా నుంచి పారిపోయిన యువతి చెప్పిన విషయాలను అంతర్జాతీయ మీడియా బహిర్గం చేయడంతో ఇప్పుడు బయటి ప్రపంచానికి తెలుస్తోంది. కిమ్‌ జోంగ్ ఉన్‌ కీచక పర్వానికి సంబందించిన చాలా విషయాలను వెల్లడించిందా యువతి.. యవ్వన దశలో ఉన్న అందమైన అమ్మాయిల కోసం కిమ్‌ సన్నిహితులు దేశ వ్యాప్తంగా ఆన్వేషిస్తారట. ఇందుకోసం కొంతమంది యువతులను ఎంచుకున్న తరువాత వారి కుటుంబ, రాజకీయ నేపథ్యం గురించి వివరాలు తెలుసుకుంటారు. ఉత్తర కొరియా నుంచి పారిపోయిన లేదా దక్షిణ కొరియా, ఇతర దేశాల్లో బంధువులు ఉన్న వారిని పక్కన ఆ జాబితా నుంచి తొలగిస్తారు. అలా యువతులను ఎంపిక చేశాక వారికి కన్యత్వ పరీక్షలు చేయిస్తారట.

సదరు యువతుల శరీరంపై చిన్న మచ్చ ఉన్నా అనర్హులుగా ప్రకటిస్తారట. ఫైనల్ గా ఎంపిక చేసిన వారిని ప్యాంగ్యాంగ్‌కు తీసుకెళ్తారు. కిమ్‌ జోంగ్ ఉన్‌ ను అన్ని రకాలుగా సుఖ పెట్టడమే ఆ యువతుల పని అని పార్క్‌ అనే అమ్మాయి చెప్పినట్లు అంతర్జాతీయ మీడియా కధనం. ఇక ఇలా ఎంపిక చేసిన యువతులను మూడు విభాగాలుగా విభజిస్తారట. మసాజ్‌ చేయడానికి ఒక బృందం, పాటలు పాడి డ్యాన్స్‌ చేయడానికి మరో బృందానికి ట్రైనింగ్ ఇస్తారు. మూడో గ్రూపు మాత్రం లైంగిక కార్యకలాపాల కోసం పనిచేయాలట. నియంత కిమ్‌ జోంగ్ ఉన్‌ తో సన్నిహితంగా మెలగి ఆయన అన్ని అవసరాలు తీర్చడమే వారి పని. పురుషులను ఎలా సంతోషపెట్టాలని నేర్చుకోవడమే వారి అసలైన పని.

చాలా అందమైన అమ్మాయిలను మాత్రమే కిమ్‌ దగ్గరకు పంపిస్తారని సదరు యువతి చెప్పినట్లు తెలుస్తోంది. ఆ యువతులకు సుమారు 20ఏళ్ల వయసు వచ్చే వరకు బృందంలోనే ఉంచుకొని, తర్వాత కిమ్‌ జోంగ్ ఉన్‌ అంగరక్షకులతో వారికి పెళ్లి చేస్తారని సమాచారం. ఐతే ఇక్కడ ఆసక్తికరపమైన విషయం ఏంటంటే ఇలా కిమ్‌ జోంగ్ ఉన్‌ దగ్గరకు పంపించేందుకు సదరు యువతుల కుటుంబ సభ్యులు కూడా అంగీకరిస్తారట. పేదరికం, ఆకలితో తమ పిల్లలు అలమటించకుండా, డబ్బులు ఇవ్వడమే అందుకు కారణమని చెబుతున్నారు. ఏదేమైనా కిమ్‌ జోంగ్ ఉన్‌ గురించిన కొత్త విషయం ప్రపంచానికి తెలిసి ముక్కున వేలేసుకుంటున్నారు.

 


Comment As:

Comment (0)