Gold Idli

హైదరాబాద్ లో గోల్డ్ ఇడ్లీ.. అదిరిపోయే టేస్ట్.. ధర ఎంతంటే

స్పెషల్ రిపోర్ట్- మన హైదరాబాద్‌ (Hyderabad) అంటే  ఛార్మినార్ (Charminar) ఆ తరువాత గుర్తుకు వచ్చేది బిర్యానీ (Biryani). అవును బిర్యానీ అంటే హైదరాబాద్ లోనే తినాలన్నంత ఫేమస్ అయ్యింది మన హైదరాబాద్ ధమ్ బిర్యాని. ఈ క్రమంలో ఇప్పుడు హైదరాబాద్‌ ఫేమస్‌ డిషెస్‌లో మరో కొత్త రకం డిష్ వచ్చి చేరింది. అదే బంగారం ఇడ్లీ (Gold Idli). ఎంటీ ఆశ్చర్యపోతున్నారా..

అసలు ఈ గోల్డ్ ఇడ్లీ కధేంటో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా.. సాధారణంగా మనం తినే ఇడ్లీ ప్లేటు ఎంత ఉంటుంది.. మహా అయితే 30 రూపాయల నుంచి 100 వరకు ఉంటుంది. అదే ఫైవ్‌ స్టార్‌ హోటళ్లలో అయితే ఎంత లేదన్నా 500 రూపాయల వరకు ఉంటుంది. కానీ ఈ గోల్డ్‌ ఇడ్లీ ధర తెలిస్తే మాత్రం షాక్‌ అవ్వాల్సిందే. ఎందుకంటే ఈ ఇడ్లీ ధర 1200 రూపాయలు.

ఎందుకంత ధర అంటే ఇది నిజంగా బంగారు ఇడ్లీనే. స్వఛ్చమైన 24 క్యారెట్స్‌ గోల్డ్‌ ఇడ్లీ అన్నమాట. బంగారు పూత పూసిన ఈ ఇడ్లీని గులాబీ రేకులతో చాలా కలర్‌ ఫుల్‌ గా గార్నిష్‌ చేసి సర్వ్‌ చేస్తారు. ఈ డిఫరెంట్‌ ఇడ్లీని టేస్ట్‌ చేయాలంటే మాత్రం హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌ లోని కృష్ణ ఇడ్లీ అండ్‌ దోస కేఫ్‌కు వెళ్లాలి.

కృష్ణ ఇడ్లీ అండ్ దోస కేఫ్ లో గోల్డ్‌ ఇడ్లీ మాత్రమే కాదు బంగారు దోశ (gold Dosa), గులాబ్ జామూన్ బజ్జీ, మలై ఖోవా గులాబ్‌ జామున్‌ వంటి నోరూరించే వెరైటీ వంటలెన్నో ఉన్నాయి. మరి మీరు కూడా గోల్డ్ ఇడ్లీ, దోస ను టేస్ట్ చేయాలంటే వెంటనే బంజారాహిల్స్ వెళ్లి ట్రై చేయండి.

 


Comment As:

Comment (0)