Dil Raju

తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న దిల్‌రాజు

ఏ పార్టీ తరపున పోటీ చేసినా నేను ఎంపీగా గెలుస్తా - దిల్‌ రాజు

ఫిల్మ్ రిపోర్ట్- ప్రముఖ సినీ నిర్మాతలు దిల్‌ రాజు (Dil Raju), సి.కల్యాణ్‌ (C Kalyan) ఆదివారం జరగనున్న తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి (TFCC) ఎన్నికల్లో అధ్యక్ష్య పదవికి పోటీ చేస్తున్నారు. ఈ సందర్బంగా తన ప్యానెల్‌ సభ్యులతో దిల్‌రాజు శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఏ రాజకీయ పార్టీ తరఫున పోటీ చేసినా తాను ఎంపీగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు దిల్ రాజు. ఐతే తన ప్రాధాన్యత మాత్రం ఎప్పటికీ సినిమా రంగానికే ఉంటుందని చెప్పారు.

ఇండస్ట్రీలోని సీనియర్లు ముందుకు రాకపోవడం వల్లే ఈ సారి తాను ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు దిల్ రాజు తెలిపారు. తాను ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడిగా ఎన్నికైనా కిరీటాలు పెట్టరని, తనకు కొత్త సమస్యలు వచ్చినట్టేనని చెప్పారు. ఐతే సినీ పరిశ్రమ అభివృద్ధి, సంక్షేమం కోసమే తాను ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు దిల్ రాజు స్పష్టం చేశారు.
 


Comment As:

Comment (0)