మహేశ్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో గుంటూరు కారం

మహేశ్ బాబు గుంటూరు కారం నుంచి ‘దమ్‌ మసాలా’ సాంగ్‌ ప్రోమో

మూవీ రిపోర్ట్- సూపర్ స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu) హీరోగా రూపొందుతున్న గుంటూరు కారం (Guntur Kaaram) మూవీ నుంచి.. దమ్‌ మసాలా సాంగ్‌ ప్రోమో విడుదలైంది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌ సంగీతం అందిస్తున్నారు. జయం రవి, జగపతిబాబు, ప్రకాష్‌రాజ్‌, రమ్యకృష్ణ,మీనాక్షి చౌదరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా  గుంటూరు కారం  సినిమా నుంచి దమ్‌ మసాలా అంటూ సాగే పాటకు సంబంధించిన ప్రోమోను చిత్రబృందం విడుదల చేసింది. మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్ కావడంతో గుంటూరు కారంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


Comment As:

Comment (0)