Maldives

మాల్దీవుల అందాల గురించిన విశేషాలు

ప్రపంచంలో అందమైన పర్యాటక ప్రాంతం మాల్దీవులు

ఇంటర్నేషనల్ రిపోర్ట్- ప్రపంచంలోని గొప్ప పర్యాటక దేశాల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది మాల్దీవులు (Maldives) గురించి. హిందూ మహా సముద్రంలోని చిన్న దేశమే మాల్దీవులు. మన దేశంతో పాటు (India), శ్రీలంకకు (Sri lanka) అత్యంత దగ్గరలో ఉన్న  మాల్దీవులు అందాలను చూసేందుకు కాలంతో సంబంధం లేకుండా టూరిస్టులు క్యూ కడుతుంటారంటే అతియోశక్తి కాదేమో. మాల్దీవులు గురించి చెప్పాలంటే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. చుట్టూ నీలిరంగులో మెరిసిపోయే సముద్రపు అందాలు, ఎటు చూసినా మెత్తని ఇసుక తిన్నెలు, ప్రకృతి అందాల మధ్య వెన్నెల రాత్రులు, ఆహ్లాదకరమైన ప్రకృతి సోయగాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి మాల్దీవుల్లో. చెప్పాలంటే ఓ మనిషి తన జీవితాన్ని ఎంజాయ్ చేయడనాకి ఇంతకంటే అందమైన ప్రాంతం మరొకటి ఉండదని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఈ మధ్య కాలంలో సినిమా తారలు, వ్యాపార ప్రముఖులు, క్రికెట్ తారలు ఎక్కువగా మాల్దీవులకు వెళ్లి ఎంజాయ్ చేయడమే కాదు, అక్కడ సరదాగా దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు.

మాల్దీవుల గురించిన విశేషాలు...

మాల్దీవులు దేశంలో 26 పగడపు దీవులు, 1200 దీవులున్నాయి. అందుకే ప్రపంచ పర్యాటకులను బాగా ఆకర్షిస్తోంది.

మాల్దీవుల దేశ రాజధాని మాలే. అంతే కాదు మాల్దీవుల్లో మాలే నే అతి పెద్ద సిటీ. 

మాల్దీవులు సముద్ర మట్టానికి కేవలం 1.5 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దీంతో ఇక్కడ వల్ల వాతావరణ మార్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 

మాల్దీవులు ద్వీపాల్లో చాలా అందమైన రిసార్టులున్నాయి. దీంతో కొత్తగా పెళ్లయిన జంటలు హనీమూన్‌ కోసం, ఏకాంతంగా గడిపేందుకు సెలబ్రిటీలు, పర్యాటకులు క్యూ కడుతుంటారు.

మాల్దీవుల జనాభా దాదాపు 5.6 లక్షలు. భారత్‌, శ్రీలంక, అరబ్‌ దేశాల సంస్కృతి, సంప్రదాయాలు ఇక్కడ మనకు కనిపిస్తుంటాయి. 

మాల్దీవులు సముద్ర జీవ వైవిధ్యానికి నెలవు. ఇక్కడ సుమారు 2వేల రకాల చేపలు, 200 జాతుల పగడపు దీవులను వీక్షించవచ్చు. డైవర్స్‌, సర్ఫర్లు, మెరైన్‌ జీవ సైంటిస్టులు ఎక్కువగా ఈ దేశాన్ని సందర్శిస్తుంటారు.

ప్రపంచంలోనే తొలిసారి నీటి అడుగున నిర్మించిన హోటల్‌ కాన్రాడ్ మాల్దీవ్స్‌ రంగాలీ ఐలాండ్ మాల్దీవుల్లోనే ఉంది. సముద్రంలో 16 అడుగుల లోతులో, రెండు అంతస్తుల్లో నిర్మించిన ఈ హోటల్లోంచి చూస్తే సముద్రంలోని అందాలన్నీ కనిపిస్తాయి.

ఇక్కడ సంప్రదాయ వంటకాలను చేపలు, కొబ్బరి, బియ్యం, పండ్లను మేలవించి తయారు చేస్తారు. మాల్దీవుల్లో గరుధియా, మాస్‌ హుని, హెధికా వంటకాల రుచులు ఫేమస్.

మాల్దీవులు టూరిస్ట్ ప్రాంతమే అయినా.. భహిరంగ ప్రదేశాల్లో మద్యం తీసుకోవడానికి వీల్లేదు. రిసార్టులు, పర్యాటక సంస్థలు మాత్రమే ఇక్కడ మద్యం సరఫరా చేస్తాయి. 

మాల్దీవుల్లో ధోనీస్ చాలా ఫేమస్‌. సంప్రదాయ పడవను ఇక్కడ ధోనీస్ అని పిలుస్తారు. చేపల వేటకు, ఒక ద్వీపం నుంచి మరొక ద్వీపానికి పర్యాటకుల రాకపోకలు వీటిలోనే సాగుతాయి. 

మాల్దీవుల కరెన్సీ రూఫియా. అమెరికన్‌ డాలర్లు, ఇతర విదేశీ కరెన్సీతో కూడా ఇక్కడ లావాదేవీలు జరుగుతాయి.

ఇవండీ మాల్దీవుల గురించి విశేషాలు. మీకు ఏ మాత్రం అవకాశం దొరికినా తప్పకుండా మాల్దీవులు వెళ్లి అక్కడి అందాలను తిలకించి ఎంజాయ్ చేయండి.


Comment As:

Comment (0)