Gold Price

వెండి కిలో 7700 తగ్గింది

భారీగా తగ్గిన బంగారం ధర - 3నెలల్లో 2650 పతనం 

బిజినెస్ రిపోర్ట్- బంగారం ప్రియులకు తీపికబురు. గత నెలలో బంగారం ధరలు భారీగా పెరిగాయి కదా.. ఇక ఇప్పుడు మాత్రం బంగారం ధర (Gold Rate) క్రమంగా పడిపోతోంది. ఈ వారం పది రోజుల్లో చూస్తే తగ్గుతూ వస్తోంది. ఇదిగో ఈ రోజు బుధవారం కూడా బంగారం, వెండి ధరలు భారీగానే తగ్గాయి. బంగారం ధర (Gold Price) మే నెలలో ఆల్ టైమ్ గరిష్టాన్ని పెరిగింది. ఐతే ఆ తరువాత గోల్డ్, సిల్వర్ రేట్లు వేలల్లో తగ్గుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌ లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 1903 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ ధర (Silver Price) 22.59 డాలర్ల వద్ద ఉంది. అటు డాలర్‌ తో చూస్తే రూపాయి మారకం విలువ 83.395 రూపాయలకు తగ్గింది. రూపాయి విలువ భారీగా పడిపోయింది. ఇదే క్రమంలో బంగారానికి డిమాండ్ పడిపోయి ధర తగ్గుతోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

భారత్ మార్కెట్‌ లో 22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయలు తగ్గి 10 గ్రాములపై 54,550 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్స్ బంగారం ధర 110 తగ్గి 59,510 కి చేరింది. అంతకు ముంద వరుస సెషన్లలో కలిపి ఏకంగా  600 రూపాయలు పడిపోయింది.  హైదరాబాద్‌లో మే 5న అత్యధికంగా 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములపై 57,200 పలికింది. ఇక ఇప్పుడు అదే  బంగారం 54,550కి చేరింది. అంటే ఈ 3 నెలల వ్యవధిలోనే ఏకంగా 2650 తగ్గిందన్నమాట. మరోవైపు వెండి రేట్లు కూడా వరుసగా పతనం అవుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో కేజీ వెండి ధర 76 వేల రూపాయలుగా ఉంది. ఇక్కడ రికార్డ్ స్థాయిలో మే 5న ఏకంగా కిలో వెండి  83,700 మార్కుకు చేరింది. అంటే 3 నెలల్లో ఏకంగా వెండి కిలోకు 7700 దిగివచ్చింది. మరి బంగారం, వెండి ప్రియులకు ఇది శుభవార్తే కదా.


Comment As:

Comment (0)