Pragyan

విక్రమ్ ల్యాం డర్‌ (Lander) నుంచి ప్రగ్యాన్ రోవర్‌ (Rover) మెల్లిగా

చందమామ పైకి రోవర్‌ దిగిందిలా.. వీడియో షేర్‌ చేసిన ఇస్రో

స్పెషల్ రిపోర్ట్- జాబిల్లిపై రోవర్‌ అడుగుపెడుతున్న దృశ్యాలను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) శుక్రవారం విడుదల చేసింది. చందమామ దక్షిణ ధ్రువంపై చంద్రయాన్‌-3 (Chandrayaan-3) సురక్షితంగా ల్యాండ్అవ్వడంతో ప్రపంచ అంతరిక్ష రంగంలో భారత్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ నెల 23న సాయంత్రం సరిగ్గా 6.04 గంటలకు చంద్రయాన్‌-3 విక్రమ్ ల్యాండర్‌ సక్సెస్ ఫుల్ గా జాబిల్లిపై అడుగుపెట్టగా, కొన్ని గంటల తర్వాత అందులో నుంచి ప్రగ్యాన్ రోవర్‌ బయటకు వచ్చి తన పరిశోధనను మొదలుపెట్టింది. ఈ సందర్బంగా ఇస్రో (ISRO) తాజాగా ఓ వీడియోను విడుదల చేసింది. విక్రమ్ ల్యాం డర్‌ (Vikram Lander) నుంచి ప్రగ్యాన్ రోవర్‌ (Pragyan Rover) మెల్లిగా తన ఆరు చక్రాలపై జారుకుంటూ చంద్రుడి ఉపరితలంపైకి అడుగుపెట్టిన దృశ్యాలను షేర్ చేసింది ఇస్రో. ఇప్పడు ఇస్రో ట్విట్టర్ లో షేర్ చేసిన రోవర్ వీడియో వైరల్ అవుతోంది.


Comment As:

Comment (0)