గతంలోనే సుధీర్ పెళ్లి గురించి చెప్పిన రష్మి
సుడిగాలి సుధీర్ కు ఆమెతో నిశ్చితార్ధం – మరి రష్మి సంగతేంటి?
స్పెషల్ డెస్క్- సుడిగాలి సుధీర్.. జబర్దస్త్ కామెడీ షోతో తనకంటూ ప్రత్యేకమైన తెచ్చుకున్నాడు. మెజీషియన్ గా కేరీర్ ప్రారంభించి ఆత తరువాత జబర్ధస్త్ షోలో కమెడియన్ గా మారిన సుధీర్ ఆ తర్వాత యాంకర్ గానూ రూపాంతరం చెందాడు. ఈ క్రమంలో అందమైన యాంకర్ రష్మితో లవ్ ట్రాక్ సుధీర్ కు బాగా కలిసొచ్చిందని చెప్పాలి. సుధీర్ - రష్మి జోడికి టాలీవుడ్ లో ప్రత్యేకమైన ఫ్యాన్ పాలోయింగ్ ఉంది. స్క్రీన్ మీద మెస్మరైజ్ చేసే ఈ జంట నిజ జీవితంలో కూడా ప్రేమలో ఉన్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఐతే అందులో ఏమాత్రం నిజం లేదని సుధీర్, రష్మిలు చాలాసార్లు తేల్చిచెప్పారు.
మా మధ్య ఉన్న బంధం ఏదైనా కావొచ్చు.. దాని గురించి ప్రతి ఒక్కరికీ వివరించలేను.. కొన్ని విషయాలు నాలోనే దాచుకుంటా.. భవిష్యత్తులో ఏమవుతుందో తెలియదు.. ఏం జరిగినా అది తప్పకుండా అందరికీ తెలుస్తుంది.. మేం ఆఫ్‌స్క్రీన్‌లో ఎలా ఉంటామో, అదే ఆన్‌స్క్రీన్.పై కనిపిస్తుంది.. మాది పదేళ్ల ప్రయాణం.. మేం అనుకొని అదంతా చేయలేదు.. ఓ మ్యాజిక్‌లా మా కెమిస్ట్రీ అందరినీ ఆకర్షించింది.. అని గతంలో సుధీర్ గురించిన అనుబంధం గురించి చెప్పింది రష్మి.
ఈ క్రమంలో సుధీర్ కు చెందిన ఓ వార్త ఆసక్తిరేపుతోంది. వరుసకు మరదలు అయ్యే తన బంధువుల అమ్మాయినే సుధీర్ పెళ్లి చేసుకుంటాడని గతంలోనే ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ తాజాగా ఆమెతోనే సుధీర్ నిశ్చితార్ధం చేసుకున్నాడని సన్నిహితుల ద్వార తెలుస్తోంది. ఈ నిశ్చితార్ధ కార్యక్రమం కూడా సుధీర్ దగ్గరి బంధువుల మధ్య జరిగిందని సమాచారం. ఈ వార్త తెలిసాక సుధీర్ రష్మి అభిమానులు సోషల్ మీడియా వేధికగా తమ ఆవేధనను వ్యక్యం చేస్తున్నారు.
మరదలితో నిశ్చితార్ధం గురించి గత రెండురోజులుగా ప్రచారం జరుగుతున్న సుధీర్ స్పందించకపోవడం ఏంటని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఎంటన్నా.. రష్మీతో రీల్ పెళ్లి ఎన్నోసార్లు చేసుకున్నారు.. కాబట్టి అదే రియల్ చేస్తారు అనుకున్నాం.. అంటూ గతంలో రష్మి చేసిన కామెంట్స్‌ను గుర్తు చేస్తూ సుధీర్ అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.