KCR ex CM

ఆ ఇంటితో కేసీఆర్ కు 20 ఏళ్ల సుదీర్ఘ అనుబంధం

ఢిల్లీ తుగ్లక్‌ రోడ్‌ ఇంటితో తెగిన కేసీఆర్‌ బంధం

స్పెషల్ రిపోర్ట్- తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (Ex CM KCR) కు దేశ రాజధాని దిల్లీలోని అధికారిక నివాసంతో బంధం తెగిపోయింది. సుమారు 20 సంవత్సరాలపాటు సదరు ఇంటితో ఉన్న సుదీర్ఘ అనుబంధానికి తెరపడింది. 2004లో టీఆర్ఎస్ తరఫున కరీంనగర్‌ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచిన కేసీఆర్‌ మన్మోహన్‌ సింగ్‌ మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. దీంతో అప్పుడు కేంద్ర మంత్రి హోదాలో కేసీఆర్ కు ఢిల్లీ తుగ్లక్‌ రోడ్‌ (Tughlaq Road house) లోని టైప్‌ 8 క్వార్టర్‌ ను ప్రభుత్వం కేటాయించింది కేంద్రప్రభుత్వం. ఆ తరువాత 2006లో కేంద్ర మంత్రి పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేసిన కేసీఆర్, మల్లీ ఉపఎన్నికలో ఎంపీగా గెలిచి అదే నివాసంలో ఉన్నారు. ఆ తరువాత 2009లో మహబూబ్‌నగర్‌ నుంచి ఎంపీగా ఎన్నికైన కేసీఆర్ అదే నివాసంలో కంటిన్యూ అయ్యారు.

ఇక 2014లో తెలంగాణ ముఖ్యమంత్రి గా భాద్యతలు స్వీకరించారు కేసీఆర్. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర ప్రభుత్వం దిల్లీలో అధికారిక నివాసాలు కేటాయిస్తుంది. ఈ క్రమంలో కేసీఆర్ కోరిక మేరకు అదే నివాసాన్ని కేసీఆర్‌కు కేటాయించింది కేంద్ర సర్కార్. అంతే కాదు నిజామాబాద్‌ ఎంపీగా గెలిచిన కేసీఆర్‌ కూతురు కల్వకుంట్ల కవిత సైతం ఆ నివాసాన్నే తన అధికారిక నివాసంగా తీసుకున్నారు. దీంతో తుగ్లక్ రోడ్ లోని క్వార్టర్ 8 సీఎం కేసీఆర్, ఎంపీ కవితకు అధికారిక నివాసంగా మారింది. తిరిగి 2018లో కేసీఆర్‌ రెండవసారి తెంలగాణ ముఖ్యమంత్రి అయ్యాక అదే నివాసాన్ని కొనసాగిస్తూ ఢిల్లీకి వెళ్లినప్పుడు అక్కడే ఉంటూ వస్తున్నారు. తాజాగా జరిగిని అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో సీఎం పదవికి కేసీఆర్‌ రాజీనామా చేశారు. దీంతో ఢిల్లీలోని ప్రభుత్వ నివాసాన్ని ఖాళీ చేస్తున్నారు కేసీఆర్. మొత్తానికి 2004 నుంచి 20 ఏళ్ల అనుబంధం ఉన్న నివాసంతో కేసీఆర్ కు అనుబంధం తెగిపోయింది.


Comment As:

Comment (0)