KTR and Modi

ప్రధాని మోదీ ఏ మొఖం పెట్టుకుని వస్తున్నారు - కేటీఆర్

తెలంగాణ భవన్- భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఏ మొఖం పెట్టుకుని తెలంగాణ పర్యటనకు వస్తున్నారని ప్రశ్నించారు బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (KTR). ముందు నుంచి తెలంగాణను మోదీ వ్యతిరేకిస్తూ వస్తున్నారని ఆయన అన్నారు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌ (Gujarat) లోని దహోధ్‌ లో 20వేల కోట్లతో కోచ్ ఫ్యాక్టరీ పరిశ్రమ ఏర్పాటు చేసి, తెలంగాణకు మాత్రం తూతూమంత్రంగా 500 కోట్లతో ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామంటే ఎలా అన్నారు కేటీఆర్. బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతామని మోసం చేసిన ప్రధాని, వరంగల్‌ కు ఎలా వస్తున్నారని ప్రశ్నించారు. మోదీ తెలంగాణ పర్యటనకు బీఆర్ఎస్ భహిష్కరిస్తోందని కేటీఆర్ చెప్పారు. 

ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపైనా కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ధరణి పోర్టల్‌ విషయంలో రేవంత్‌ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని కేటీఆర్‌ విమర్శించారు. గాంధీ భవన్‌ లోనే గాడ్సేలు ఉన్నారన్న కేటీఆర్, రేవంత్ ఏ రోజూ మోదీని విమర్శించరని అన్నారు. ఆయన  ఆరెస్సెస్, బీజేపీ మనిషి అని చెప్పారు. ధరణి ఎంత సక్సెస్ అయ్యిందో మేం ప్రజలకు వివరిస్తామన్న కేటీఆర్.. భూ దందాలు, ఆక్రమణలు చేసే వాళ్లకు ధరణి నచ్చడం లేదని కామెంట్ చేశారు. 

హుజూరాబాద్, నాగార్జున సాగర్, దుబ్బాక, మునుగోడులో కాంగ్రెస్, బీజేపీ లు కలిసి పని చేశాయని కేటీఆర్ ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ అన్న ఆయన.. దేశానికి ప్రధాని మోదీ చేసింది ఏమీ లేదని విమర్శించారు. రాహుల్ గాంధీని నేతగా ఎవరూ గుర్తించడం లేదని, 4 వేల రూపాయల పింఛన్‌ ను రాహుల్ గాంధీ ఏ హోదాలో ప్రకటించారని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ పుట్టు పూర్వోత్తరాలు మొత్తం తెలంగాణ ప్రజలకు తెలుసని.. ఆ పార్టీ నాయకులు కొత్త బిచ్చగాల్లుగా వస్తున్నారని ఎద్దేవా చేశారు.


Comment As:

Comment (0)