Khushi

సెప్టెంబరు 1న విడుదలవుతున్న ఖుషి

సమంత నవ్వు చూడాలి, ఆమె కష్టం గురించి చెప్పలేను - విజయ్‌ దేవరకొండ

మూవీ రిపోర్ట్- వచ్చే నెల సెప్టెంబరు 1న నా తరఫున ఖుషి (Kushi) తీసుకొస్తున్నానని చెప్పారు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). విజయ్‌, సమంత (Samantha) జంటగా నటించిన ప్రేమకథా చిత్రం ఖుషి (Kushi). డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబరు 1న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ఖుషి చిత్ర బృందం హైదరాబాద్‌లో అట్టహాసంగా మ్యూజికల్‌ కన్సెర్ట్‌ ను నిర్వహించింది. ఈ సందర్బంగా మాట్లాడిన విజయ్ దేవరకొండ.. మీరంతా నవ్వుతూ బయటకు వచ్చిన సినిమాని ఎప్పుడు ఇచ్చానో నాకు గుర్తులేదన్నారు. విజయ్‌ బ్రో.. సెప్టెంబరు 1న నీ ముఖంలో నవ్వు చూడాలని ఉంది.. అదొక్కటే గుర్తుపెట్టుకుని పనిచేస్తున్నానని డైరెక్టర్ శివ నెల నుంచి చెబుతున్నాడని విజయ్ చెప్పారు. 

ఐతే.. నా ముఖంలో కాదు, సమంత ముఖంలో నవ్వులు చూడాలని ఉందని విజయ్ దేవరకొండ అన్నారు. సమంత ఖుషి సినిమా కోసం ఎంత కష్టపడిందో మాటల్లో చెప్పలేనన్న విజయ్.. గత సంవత్సరం ఏప్రిల్‌ లో నవ్వుతూ సినిమాని ప్రారంభించామని చెప్పారు. షూటింగ్ చివరి దశలో ఉన్న టైంలో సమంత ఆరోగ్యం దెబ్బతింది. స్క్రీన్‌ పై బాగానే కనిపిస్తుంది కదా మేం కాస్త లైట్ గా తీసుకున్నామని గుర్తు చేశారు. ఐతే సమంత పరిస్థితి ఆ తర్వాత అర్థమైందని చెప్పారు. దాంతో కొన్ని రోజులు విరామం తీసుకోమని సమంతకు చెప్పామని అన్నారు విజయ్ దేవరకొండ.

ఇక సమంత (Samantha) మాట్లాడుతూ.. మీరంతా మా పాటలను ఎంజాయ్‌ చేయడాన్ని ప్రత్యక్షంగా చూడడం చాలా సంతోషంగా ఉందని చెప్పింది. మీతో కలిసి సినిమా చూడాలనిపిస్తోందన్న సమంత.. ఖుషి మీకు నచ్చుతుందని భావిస్తున్నానని అంది. నిర్మాతలు రవి, నవీన్‌ నన్ను అర్థం చేసుకున్నారని, ఆ విషయాన్ని నేనెప్పటికీ గుర్తుపెట్టుకుంటానని చెప్పుకొచ్చింది. విజయవాడలో సమంత ఇడ్లీ స్టాల్‌ పెట్టే పరిస్థితి రాలేదన్న సమంత, విజయ్‌, శివల ఇడ్లీ బిజినెస్‌ కేపబిలిటీ పై నాకు సందేహం ఉందిగానీ.. ఓ బ్లాక్‌ బస్టర్‌ సినిమా తీసే కేపబిలిటీపైన ఏమాత్రం సందేహం లేదని కామెంట్ చేసింది.


Comment As:

Comment (0)