Kushi

ఖుషి సినిమాలో వాళ్లిద్దరే స్పెషల్ -kushi telugu movie review

ఖుషి సినిమా రివ్యూ - విజయ్, సమంత జోడి ఎలా ఉందంటే..

మూవీ రిపోర్ట్- విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), సమంత (Samantha) జోడీగా శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఖుషి (Khushi) సినిమా రివ్యూ మీ కోసం.. 

సినిమా- ఖుషి kushi telugu movie review 
తారాగణం- విజయ్‌ దేవరకొండ, సమంత, జయరామ్‌, సచిన్‌ఖేడేకర్‌, వెన్నెల కిషోర్‌, మురళీ శర్మ, రాహుల్‌ రామకృష్ణ తదితరులు
ప్రొడక్షన్- మైత్రీ మూవీమేకర్స్‌మ్యూజిక్- హేషామ్ అబ్దుల్ వహాబ్
సినిమాటోగ్రఫీ- మురళి జి.
ఎడిటర్‌- ప్రవీణ్‌ పూడి
నిర్మాతలు- నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌
దర్శకత్వం- శివ నిర్వాణ

పరిచయం........ kushi telugu movie review 
లవ్ స్టోరీస్ ను ఎమోషనల్‌ గా చూపించడంలో డైరెక్టర్ శివ నిర్వాణ స్టైలేవేరు. ఇప్పుడు తన కథకు హీరో, హీరోయిన్స్ గా విజయ్‌ దేవరకొండ, సమంతలను ఎంచుకున్నప్పటి నుంచే ఖుషి పై అంచనాలు పెరిగాయి. సినిమాలోనిసాంగ్స్ సూపర్‌ హిట్‌ అవ్వడం, ప్రమోషన్స్‌సైతం భారీగా చేయడంతో ఖుషిపై హైప్ క్రియేట్ అయ్యింది. భారీ అంచనాలతో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళభాషల్లో ఈ సినిమా శుక్రవారం సెప్టెంబర్ 1న విడుదలైంది. మరి ఈ ఖుషి మూవీ ఎలా ఉంది? ప్రేక్షకులను ఖుషి చేసిందా లేదా?

ఖుషి కథేంటంటే.. kushi telugu movie review 
ఖుషి కధలోకి వెళ్తే.. లెనిన్‌ సత్యం (సచిన్‌ ఖేడేకర్‌) దేవున్ని నమ్మని ఓ నాస్తికుడు. అందరు సైన్స్‌ని మాత్రమే నమ్మాలని, మూఢనమ్మకాలతో మోసపోవద్దని ప్రచారం చేస్తుంటాడు. ఐతే అతని భార్యరాజ్యలక్ష్మీ (శరణ్య) మాత్రం భర్తకు తెలియకుండా పూజలు చేస్తుంటుంది. అతని చిన్న కొడుకు విప్లవ్‌ దేవరకొండ (విజయ్‌ దేవరకొండ) కూడా తండ్రిలాగే నాస్తికుడు. బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగం రావడంతో అడిగి మరి కశ్మీర్‌లో పోస్టింగ్‌ వేయించుకుంటాడు.అక్కడ ఆరా బేగం (సమంత)ను చూసి మొదటి చూపులోనే లవ్ లో పడతాడు. ఈ క్రమంలో ఆమె పాకిస్తాన్‌ కుచెందిన ముస్లిం అమ్మాయి అని తెలుస్తుంది. అయినప్పటికీ ఆరా బేగంను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు విప్లవ్. విప్లవ్‌ తనపై చూపించే ప్రేమకు ఆరా బేగం మైమరిచిపోతుంది. తాను ముస్లిం అమ్మాయిని కాదని, బ్రాహ్మిన్‌ అమ్మాయినని, తన అసలు పేరు ఆరాధ్య అని చెబుతుంది. కాకినాడకు చెందిన ప్రవచనకర్త చదరంగం శ్రీనివాసరావు (మురళీ శర్మ) తన తండ్రి అనిచెబుతుంది. ఐతే చదరంగం శ్రీనివాసరావుకు, లెనిన్‌ సత్యంకు అసలు పడదు. ఒకరు దేవుడు, జోతిష్యాన్నినమ్మితే, మరొకరు సైన్స్‌, టెక్నాలజీని నమ్ముతారు. ఇంకేముంది యధావిధిగానే ఇద్దరి కుటుంబాలు వీరి పెళ్లికి ఒప్పుకోరు. షరా మామూలుగానే పెద్దలను ఎదిరించి ప్రేమపెళ్లి చేసుకుంటారు విప్లవ్‌, ఆరాధ్య లు.ఆ తర్వాత ఇద్దరిమధ్య గొడవలకు కారణం ఏంటి?  ఇరుకుటుంబాల పెద్దలు ఊహించినట్లు వీరిద్దరు విడిపోయారా? లేదంటే  కలిసే ఉన్నారా? చివరకు ఏం జరిగింది? ఇవన్నీ తెలియాలంటే మాత్రం ఖుషి సినిమా దియేటర్ లో చాడాల్సిందే...

ఖుషి ఎలా ఉందంటే.. kushi telugu movie review 
భార్యా భర్తల మధ్య విబేదాలు, కోప తాపాలు సహజమని, వాటిని అర్ధం చేసుకుంటూ ఒకరికొకరు తోడుగా ముందుకు సాగడమే జీవితం అని చెప్పే ప్రయత్నమే ఖుషి సినిమా. రక్తం పంచుకు పుట్టిన పిల్లలు, కుటుంబం కంటే సిద్దాంతాలు, శాస్త్రాలు ఏ మాత్రం గొప్పవి కాదని చెప్పే కధ ఇది. నిన్నుకోరి, మజిలి సినిమాల్లో లవ్‌ ఫెయిల్యూర్‌ అయిన వ్యక్తి బాధను చూపించిన డైరెక్టర్ శివ నిర్వాణ.. పెద్దలను ఎదురించి, ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ జంట మధ్య ఎలాంటి విషయాలు అపార్థాలకు కారణమవుతుంటాయి?  భిన్న నేపథ్యం ఉన్న కుటుంబాలను నుంచివచ్చిన వారికి ఆ అపార్థాల ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందనేది కళ్లకు కట్టినట్లు చూపించాడు. మొదటి భాగంలో హీరో హీరోయిన్ల లవ్‌స్టోరీ చూపిస్తే, రెండవ భాగంలో పెళ్లి తరువాత జీవితాన్ని చూపించాడు డైరెక్టర్. చదరంగం శ్రీనివాసరావు, లెనిన్‌ సత్యం ఓ న్యూస్ ఛానల్ డిబేట్ లో గొడవపడిన ఘటనతో సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత విప్లవ్ కశ్మీర్‌కి వెళ్లి, హీరోయిన్‌ ని చూసేంత వరకు కథ స్లోగా వెళ్తుంది. విప్లవ్‌ ఆరా బేగం ప్రేమలో పడ్డప్పటి నుంచి కథలో ఆసక్తి, వేగం పెరుగుతుంది. ఆమె ప్రేమను గెలిచేందుకు విప్లవ్‌ చేసే కొన్ని పనులు కామెడీగా ఉంటాయి. వెన్నెల కిశోర్‌, విజయ్‌ల మధ్య  సన్నివేశాలు సూపర్ అని చెప్పవచ్చు. ఇక విప్లవ్, బేగం పెళ్లి  తర్వాతవచ్చే రొమాంటిక్‌ సాంగ్‌ యువతతో పాటు అందరిని బాగా ఆకట్టుకుంటుంది. సినిమాలో చివరి 30 నిమిషాలు కథ ఎమోషనల్‌ గాసాగుతుంది. సైన్స్‌, శాస్త్రాల కంటే ప్రేమ గొప్పదని చూపించడానికి  డైరెక్టర్ రాసుకున్న సన్నివేశాలు బావున్నాయి. ఇలాంటి సెన్సిటివ్ అంశాలను అతి సున్నితంగా తెరపై చూపించాడు. ఐతే క్లైమాక్స్‌ రొటీన్‌గా ఉంటుంది. అందమైన లొకేషన్స్‌, విజులవ్‌ ఎఫెక్ట్స్‌, నేపథ్య సంగీతం సినిమా స్థాయినిపెంచాయని చెప్పవచ్చు. 

ఎవరెలా చేశారంటే.. kushi telugu movie review 
విప్లవ్‌ పాత్రలో విజయ్ దేవరకొండ, ఆరాధ్య పాత్రల్లో సమంత జీవించేశారని చెప్పకతప్పదు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయింది. విజయ్‌ గత సినిమాల్లోని షేడ్స్‌ ఏవి ఈ సినిమాలో మచ్చుకు కూడా కనిపించవు. చాలా సహజంగా పక్కింటి అబ్బాయిలాగా, లవర్‌ బాయ్‌ గా తెరపై చాలా అందంగా కనిపిస్తాడు విజయ్ దేవరకొండ. అందులోను ఎమోషనల్‌ సీన్స్‌లో చాలా బాగా  నటించాడు. అటు సమంత సైతం గత సినిమాల మాదిరే తన పాత్రలో లీనమైపోయింది. చిన్మయి డబ్బింగ్‌ తన పాత్రకు మరింత వన్నె తెచ్చిందని చెప్పాలి. ప్రవచన కర్త చదరంగం శ్రీనివాసరావుగా మురళీశర్మ మరోసారి తన నటనను తెరపై చూపించాడు. హీరో తండ్రి, నాస్తికుడు లెనిన్‌ సత్యంగా సచిన్‌ ఖేడేకర్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.  ఫస్టాఫ్‌లో వెన్నెల కిశోర్‌ కామెడీ బాగా పండింది. జయరాం, రోహిణి, రాహుల్‌ రామకృష్ణతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఖుషి మూవీకి మరో ప్రధాన బలం హేషామ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్. సినిమా రిలీజ్ కు ముందే లిరిక్స్ హిట్‌ అయ్యాయి. తెరపై కూడా పాటలు వినసొంపుగా, అందగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా స్థాయిని మరింత పెంచింది. మురళీ జి. సినిమాటోగ్రఫీ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది. కశ్మీర్‌ అందాలను తెరపై చక్కగా చూపించాడు. మొత్తానికి ఖుషి సినిమా అందమైన ప్రేమ దృశ్య కావ్యం అని చెప్పవచ్చు. అందులోను యువతకు ఈ మూవీ చాలా బాగా నచ్చుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేేహం లేదు.

Note- ఇది కేవలం వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.  


Comment As:

Comment (0)