KTR Rashmika

మా చెల్లి కవిత చాలా డైనమిక్‌- కేటీఆర్

నేను రష్మిక అంత ఫేమస్ కాదన్న మంత్రి కేటీఆర్

హైదరాబాద్ రిపోర్ట్- నాన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (CM KCR) ముందు నుంచి రాకీయాల్లో ఉండటంతో చిన్నతనంలో ఆయన ప్రభావం తనపై తక్కువగా ఉండేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ (KTR) అన్నారు. హైదరాబాద్ బేగంపేట్ లోని గ్రాండ్‌ కాకతీయ హోటల్‌లో వుమెన్ ఆస్క్ కేటీఆర్ (#WomenAskKTR) పేరుతో మహిళలతో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ కుటుంబం గురించి కేటీఆర్‌ చాలా విషయాలను పంచుకున్నారు. తమ తల్లిని చూసి తాము చాలా నేర్చుకున్నామన్నామని చెప్పారు. 

 తన సతీమణి శైళిమ చాలా ఓపికగా ఉంటారన్న కేటీఆర్.. తన చెల్లి కవిత చాలా డైనమిక్‌ అని, తమ కుటుంబంలో ఆమె అంత ధైర్యవంతులు లేరని చెప్పారు. కూతురు పుట్టాక తన జీవితం చాలా మారిందని చెప్పిన కేటీఆర్‌.. తన కూతురు చిన్నవయసు నుంచే చాలా బాగా ఆలోచిస్తోందని.. కొడుకును, కూతురును సమానంగా చూస్తానని చెప్పుకొచ్చారు. ఈ సందర్బంగా డీప్‌ఫేక్‌ మహిళలకు మాత్రమే కాకుండా రాజకీయ నేతలకు సైతం ప్రమాదమేనని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ప్రత్యర్థులు డీప్‌ఫేక్ వాడి తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఐతే తాను రష్మిక (Rashmika) అంత ఫేమస్ కాదని ఈ సందర్భంగా కేటీఆర్ సరదాగా కామెంట్ చేశారు. 


Comment As:

Comment (0)