Ponnam Prabhakar.

అమలు చేయని హామీలపై చర్చకు బీజేపీ సిద్ధమా- మంత్రి పొన్నం ప్రభాకర్‌

కరీంనగర్ రిపోర్ట్- బీజేపీ పార్టీపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల గురించి అడిగే బీజేపీ నేతలు, పదేళ్లలో కేంద్రంలో మీరిచ్చిన ఎన్ని హామీలు అమలు చేశారో చెప్పాలని నిలదీశారు. పదేళ్ల ఎన్డీయే పాలనలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్‌ లోని ఇందిరా భవన్‌ లో పొన్నం ప్రభాకర్ నిరసన దీక్ష చేపట్టారు. ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాల్లో వేస్తామన్న 15 లక్షలు ఏమయ్యాయని పొన్నం నిలదీశారు. రైతు చట్టాలపై దీక్ష చేస్తే పట్టించుకోని బీజేపీ నేతలు ఇప్పుడెలా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.

బీజేపీ సర్కార్ అంబానీ, అదానీకి దోచిపెడుతోందని ఆరోపించిన పొన్నం ప్రభాకర్.. తెలంగాణ ఏర్పాటును అవమానించింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఐదేళ్లు ఎంపీగా ఉండి రాష్ట్రానికి ఏం చేశారని ఎంపీ బండి సంజయ్ ని నిలదీసిన మంత్రి పొన్నం ప్రభాకర్.. తన తల్లిని అవమానించేలా మాట్లాడారని గుర్తు చేశారు. ప్రధాని మోదీ ఏమైనా చేస్తే ఆయన ఫొటోతో ఓట్లు అడగండి కానీ రాముడి ఫొటోతో కాదని అన్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేకంగా ఏమిచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. అమలు చేయని హామీలపై చర్చకు బీజేపీ నేతలు సిద్ధమా అని సవాల్ విసిరారు మంత్రి పొన్నం ప్రభాకర్.


Comment As:

Comment (0)