PM -

విపక్ష పార్టీల భేటీపై ఫైర్ అయిన ప్రధాని మోదీ.. ముందుకు సాగలేరని కామెంట్

నేషనల్ రిపోర్ట్- దేశంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మంగళవారం బెంగళూరు (Bangalore) లో 26 విపక్ష పార్టీలు సమావేశం కాగా.. అటు ఢిల్లీలో ఎన్డీయే (NDA) కూటమి కూడా 38 పార్టీలతో తన బలాన్ని నిరూపించుకునే పనిలో ప్రత్యేకంగా సమావేశం అయ్యింది.ఢిల్లీలోని అశోక హోటల్‌ లో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) సమక్షంలో ఎన్డీయే కూటమి భేటీ జరిగింది. 

ప్రధాని నేరంద్ర మోదీ విపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తనను తిట్టేందుకు కేటాయించే సమయం.. దేశం కోసం కేటాయిస్తే బాగుండునని విపక్షాలకు హితువు పలికారు. ఢిల్లీ (Delhi) లో జరిగిన ఎన్డీఏ భేటీ తరువాత మాట్లాడిన మోదీ, బెంగళూరులో జరిగిన విపక్షాల సమావేశంపై నిప్పులు చెరిగారు. దేశాభివృద్ధే తమ అజెండా అని ప్రధాని అన్నారు. దేశం కోసం పనిచేయడంలో వెనకడుగు వేయబోమని చెప్పారు. తన శరీరంలో ప్రతి కణం.. ప్రతీ క్షణం దేశం కోసమే కేటాయించానని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. 

విపక్షాలు చిన్న చిన్న స్వార్థాలతో తమ తమ సిద్ధాంతాలను పక్కన పెడుతునపెడుతున్నాయని ప్రధాని మోదీ కామెంట్ చేశారు. నిత్యం విమర్శించుకునే వీళ్లంతా ఒక్కదగ్గరికి చేరుతారేమో గానీ ముందుకు సాగలేరని ప్రతిపక్షాలను  ఉద్దేశించి అన్నారు. కశ్మీర్‌ లో ఎన్సీ, పీడీపీ రోజూ తిట్టుకుంటాయని గుర్తు చేసిన మోదీ.. బంగాల్‌లో టీఎంసీ, కాంగ్రెస్, కమ్యునిస్టుల మధ్య ఎప్పుడూ గొడవలేనని చెప్పారు.

దేశ ప్రజలకు ఎన్డీఏ హిస్టరీ, కెమిస్ట‍్రీ తెలుసని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. దేశంలో 250 చోట్ల తమకు 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయని చెప్పిన ఆయన.. నిజాయితీగా పనిచేశామని, ఈ సారి కూడా  అలాంటి ఓట్ షేర్‌ నే సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.  


Comment As:

Comment (0)