PM Modi

వరంగల్ భద్రకాళి ఆలయంలో మోదీ ప్రత్యేక పూజ

ప్రధాని మోదీ వరంగల్ పర్యటన భారీ సక్సెస్

వరంగల్ స్పెషల్ రిపోర్ట్- భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరంగల్ పర్యటన సక్సెస్ అయ్యింది. సుమారు 30 సంవత్సరాల తరువాత దేశ ప్రధాని వరంగల్ రావడం ఇదే తొలిసారి. అందులోను మోదీ మొట్టమొదటి సారి వరంగల్ పర్యటనకప రావడంతో ఆయనను చూసేందుకు జనం బారులు తీరారు. ప్రధానిని చూసేందుకు, ఆయన ప్రసంగాన్ని వినేందుకు జనం చాలా ఆసక్తిచూపారు. హన్మకొండ ఆర్ట్స్‌ కళాశాల గ్రౌండ్ లో జరిగిన భహిరంగ సభకు తండోపతండాలుగా జనం వచ్చారు. శనివారం ఉదయం వారణాసి నుంచి ప్రత్యేక విమానంలో  హైదరాబాద్‌ హకీంపేట్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న మెదీ, అక్కడి నుంచి రక్షణ శాఖ హెలికాప్టర్‌ లో మామునూరు ఎయిర్‌ స్ట్రిప్‌ కు చేరుకున్నారు. అక్కడ ప్రధానికి అధికారులు, కొంత మంది నేతలు స్వాగతం పలికారు. 

ఆ తరువాత మామునూరు నుంచి రోడ్డు మార్గం ద్వార నేరుగా వరంగల్ భద్రకాళి ఆలయానికి వచ్చారు మోదీ. ఆలయ అర్చకులు, అధికారులు ప్రధానికి పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. భద్రకాళి అమ్మవారి దివ్య రూపాన్ని చూసి మోదీ పులకరించిపోయారు. అమ్మవారి దర్శనం తరువాత అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రధాన మంత్రి, ఆర్ట్స్ కాలేజి గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో ప్రసంగించారు. మోదీ తన ప్రసంగం మొదలుపెడుతూనే జై మా భద్రకాళి.. భద్రకాళి అమ్మవారి మహత్మ్యానికి.. అంటూ భద్రకాళి అమ్మవారిపై తనకున్న భక్తి చాటుకున్నారు. సమ్మక్క సారలమ్మను, కాకతీయుల రాణి రుద్రమదేవిని తలచుకుంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని వరంగల్‌కు రావడం సంతోషంగా ఉందని అన్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మెదీ వరంగల్ పర్యటన మినిట్ టు మినిట్ సాగిందిలా..
9.30 - హకీంపేట ఎయిర్‌ పోర్టు నుంచి ఎంఐ-17 డిఫెన్స్ హెలికాప్టర్‌ లో వరంగల్‌ మామునూరు ఎయిర్‌ స్ట్రిప్‌ నకు బయలుదేరారు.
10.12 - మూమునూరు ఎయిర్‌ స్ట్రిప్‌ కు చేరుకున్నారు.
10.36- రోడ్డు మార్గంలో భద్రకాళి ఆలయానికి చేరుకుని 26 నిమిషాల పాటు పూజలో పాల్గొన్నారు.
11.02 - భద్రకాళి ఆలయం నుంచి రోడ్డు మార్గంలో హనుమకొండ ఆర్ట్స్‌ కళాశాల మైదానానికి..
11.16 - అధికారిక కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసిన వేదికపైకి వచ్చారు.
11.17 - కేంద్ర మంత్రి, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రసంగం.
11.23 - కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రసంగం. 
11.31 - రిమోట్‌ కంట్రోల్‌తో వర్చువల్‌ విధానంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన.
11.32 - చేపట్టనున్న అభివృద్ధి పనుల ప్రయోజనాలను తెలిపే వీడియోల ప్రదర్శన. 
11.38 - రైల్వే వ్యాగన్లు, రహదారుల విస్తరణతో తెలంగాణకు కలిగే ప్రయోజనాలపై ప్రధాని మోదీ ప్రసంగం.
11.50 - విజయ సంకల్ప సభలో ఈటల రాజేందర్‌, బండి సంజయ్‌, కిషన్‌రెడ్డి ప్రసంగాలు.
12.22 - విజయ సంకల్ప సభనుద్దేశించి మోదీ ప్రసంగం ప్రారంభించి 24 నిమిషాల పాటు మాట్లాడారు.
12.50 - ప్రధాని సభాస్థలి నుంచి రోడ్డు మార్గంలో హంటర్‌ రోడ్డు మీదుగా మామునూరు ఎయిర్‌ స్ట్రిప్‌ కు బయలుదేరారు.
1.28 - మామునూరు నుంచి హెలికాప్టర్‌ లో హకీంపేటకు చేరుకున్న అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో రాజస్థాన్ బయలుదేరి వెళ్లారు. ప్రధాని మోదీ వరంగల్ టూర్ విజయవంతం కావడంతో బీజేపీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. 


Comment As:

Comment (0)