Narendra Modi

వరంగల్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ది అత్యంత అవినీతి ప్రభుత్వం - మోదీ

హన్మకొండ-వరంగల్ స్పెషల్ రిపోర్ట్- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కేసీఆర్‌ ది దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వమని మోదీ ఆరోపించారు. వరంగల్ పర్యటనకు వచ్చిన మోదీ.. హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప భహిరంగ సభలో ప్రసంగించారు. తెలంగాణలో అవినీతి లేకుండా ఏ ప్రాజెక్టు కూడా లేదని విమర్శించారు. కేసీఆర్ అక్రమాలు అఖరితి దిల్లీకి కూడా విస్తరించాయని ప్రధాని మండిపడ్డారు. అభివృద్ధి కోసం రెండు రాష్ట్రాలు లేదా రెండు దేశాల మధ్య ఒప్పందాలు ఉంటాయని, తొలిసారిగా రెండు పార్టీలు, రెండు రాష్ట్రాల మధ్య అవినీతి ఒప్పందాలు జరగడం దౌర్భాగ్యమన్నారు. 

కుటుంబ పార్టీలు అవినీతితో నిండి ఉంటాయని.. కాంగ్రెస్‌ పార్టీ అవినీతిని దేశమంతా చూసింది... ఇప్పుడు బీఆర్ఎస్ అవినీతిని తెలంగాణ చూస్తోందని మోదీ కామెంట్ చేశారు. తెలంగాణ యువత బలిదానాలు చేసింది ఇలాంటి అవినీతిని చూసేందుకేనా అని ప్రధాని ప్రశ్నించారు. తెలంగాణలో రానున్న అసంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ ల అడ్రస్‌ గల్లంతు చేస్తామని అన్నారు. కార్పొరేషన్‌ ల ఎన్నికల్లో ట్రయల్‌ మాత్రమే చూపిన బీజేపీ, తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజల దృష్టి మరల్చేందుకు బీఆర్ఎస్ సరికొత్త ఎత్తులు వేస్తోందన్న ప్రధాని, ఈ ప్రభుత్వానికి రాష్ట్రంలోని పిల్లల భవిష్యత్తుపై ఎలాంటి ఆలోచన లేదని వ్యాఖ్యానించారు. 

గడిచిన తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయలేదని మోదీ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారులను విస్మరించి.. లక్షల ఉద్యోగాలిస్తామని యువతను మోసం చేసిందని విమర్శించారు. టీఎస్‌పీఎస్సీ కుంభకోణం ద్వారా యువతను తీవ్ర నిరాశకు గురిచేయడం, యూనివర్సిటీలను నిర్వీర్యం చేసి వారికి అన్యాయం చేసిందని ఫైర్ అయ్యారు. తెలంగాణలోని 12 యూనివర్సిటీల్లో మూడువేల అధ్యాపకుల పోస్టులు,  పాఠశాలల్లో 15 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు ప్రధాని. ఎన్నికల్లో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీ ఏమైందని ప్రశ్నించిన మోదీ.. 7 లక్షల రెండు డబుల్ బెడ్రూం ఇళ్లు, లక్ష రూపాయల రుణమాఫీ ఏమైందని నిలదీశారు.
 


Comment As:

Comment (0)