Pawan Kalyan

పొత్తులపై క్లారిటీ ఇచ్చిన జనసేనాని పవన్ కళ్యాాణ్

అమరావతి- వచ్చే ఎన్నికల్లో పొత్తులపై మరోసారి క్లారిటీ (Clarity on Alliances) ఇచ్చారు జనసేన అధినేత (Janasena Chief) పవన్ కల్యాణ్ (Pawan Kalyan). అన్ని అంశాలను పరిశీలించిన తరువాతే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. నిస్వార్ధంగా కష్టపడితే అధికారం దానంతటదే వస్తుందని ఈ సందర్బంగా అన్నారు. వైసీపీ (YCP) అరాచక పాలనతో 70 శాతం ప్రజలు విసిగిపోయారని పవన్ మండిపడ్డారు. రాష్ట్రానికి స్థిరత్వం తీసుకురావడమే జనసేన లక్ష్యమని, పొత్తుల గురించి ఆలోచించేందుకు ఇంకా టైం ఉందని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు జవాబు ఇస్తూ కామెంట్ చేశారు. 

వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లాలా, కలసి వెళ్లాలా అనేది తరవాత మాట్లాడుకునే విషయమని మరోసారి స్పష్టం చేశారు పవన్. మండల స్థాయిలో సమగ్ర అధ్యయనం తర్వాతే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మనం బలంగా పని చేస్తే అధికారం దానంతట అదే వచ్చి తీరుతుందని, నాయకులు అందుకు అనుగుణంగా అడుగులు వేయాలని దిశానిర్ధేశం చేశారు. ఆదివారం నుంచి ప్రారంభం కాబోయే వారాహి (Varahi) విజయ యాత్ర రెండవ దశకు ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. రూల్ ఆఫ్ లా (Rule of Law) ను వైసీపీ విస్మరించిందని, ఆంధ్రప్రదేశ్‌ లో రూల్ ఆఫ్ లా నాశనం అయిపోయిందని మండిపడ్డారు. 

వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనే అంశాన్ని అవివేకంతో మాట్లాడడం లేదని, జగన్ రెడ్డి (Jagan reddy), వైసీపీ నాయకులు వెళ్లే మార్గం తప్పు అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పాలనలో అవినీతి తారా స్థాయికి చేరిపోయిందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో ప్రజలు రోడ్ల మీదకు రావాల్సి వచ్చిందన్న ఆయన.. వైసీపీని ఎన్నుకున్న వారం రోజుల్లోనే ప్రజలకు చేసిన తప్పు అర్ధం అయిపోయిందని వ్యాఖ్యానించారు. 


Comment As:

Comment (0)