Jr NTR

జూనియర్ ఎన్టీఆర్‌కు లక్కీ ఛాన్స్..

ఎన్టీఆర్‌కు దక్కిన అరుదైన గౌరవం.. ఆస్కార్‌ యాక్టర్స్‌ బ్రాంచ్‌ లో చోటు..

మూవీ రిపోర్ట్- యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) కు అరుదైన గౌరవం దక్కింది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో విశ్వవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ ఆస్కార్‌ యాక్టర్స్‌ బ్రాంచ్‌లో సభ్యత్వం సాధించారు. ప్రస్తుతం ఈ న్యూస్ భారత సినీ ఇండస్ట్రీలో వైరల్‌గా మారింది. ఈ సందర్బంగా సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు ఎన్టీఆర్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఆస్కార్‌ యాక్టర్స్‌ బ్రాంచ్‌ కు సంబందించిన అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ కొత్త సభ్యులను ఎంపిక చేసింది. అందులో ఎన్టీఆర్‌ పేరును అధికారికంగా ప్రకటించింది. అంకితభావం కలిగిన ఈ నటీనటులు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని ఆకర్షించారు.. తెరపై వారి నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.. అద్భుతమైన హవబావాలతో వారి వారి పాత్రలకు ప్రాణం పోశారు.. అలాంటి గొప్ప నటీనటులను యాక్టర్స్‌ బ్రాంచ్‌ లోకి ఆహ్వానం పలుకుతున్నాం.. అని అకాడమీ వ్యాఖ్యానించింది. ఇక ఎన్టీఆర్ తో పాటు మరో నలుగురు హాలీవుడ్ నటులకు కూడా  ఆస్కార్‌ యాక్టర్స్‌ బ్రాంచ్‌ లో స్థానం కల్పించారు. 

ఇక ఎన్టీఆర్‌ ప్రస్తుతం దేవర (Devara) మూవీలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రానున్న ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతోంది. దేవర మొదటి భాగం వచ్చే సంవత్సరం ఏప్రిల్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పక్కన శ్రీదేవి కూతురు జాన్వీకపూర్‌ (Janvi Kapoor) నటిస్తోంది. అంతే కాదు బాలీవుడ్ స్టార్‌ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌ గా నటిస్తున్న దేవరపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 


Comment As:

Comment (0)