నంద్యాలలో హైటెన్షన్..
చంద్రబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు..
కర్నూలు రిపోర్ట్- తెలుగుదేశం పార్టీ (TDP) జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును (Chandrababu) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నంద్యాలలోని ఆర్.కె.ఫంక్షన్ హాల్ దగ్గర చంద్రబాబు బస చేసిన బస్సు నుంచి కిందికి రాగానే పోలీసులు ఆయనతో మాట్లాడి అదుపులోకి తీసుకున్నారు. తన హక్కులు ఎందుకు ఉల్లంఘిస్తున్నారని చంద్రబాబు పోలీసులు ప్రశ్నించారు. తాను తప్పు చేస్తే నడిరోడ్డులో ఉరితీయండని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రాథమిక ఆధారాలు లేకుండా ఎలా అదుపులోకి తీసుకుంటారని పోలీసులను ప్రశ్నించారు. హైకోర్టుకు ప్రాథమిక ఆధారాలు ఇచ్చామని పోలీసులు చంద్రబాబుకు తెలిపారు. సూపర్ వైజర్ ఆఫీసర్ రావాల్సిన అవసరం ఏముందని చంద్రబాబు పోలీసులను నిలదీశారు. చంద్రబాబును అదుపులోకి తీసునే సమయంలో మీడియాను పోలీసులు దూరంగా పంపించివేశారు.