Vishnu Prabhas

శివుడిగా ప్రభాస్.. మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్ కన్నప్ప

మూవీ రిపోర్ట్- మంచు విష్ణు (Manchu Vishnu) చాలా కాలంగా కన్నప్ప (Kannappa) సినిమాపై వర్క్ చేస్తున్నారు. కన్నప్ప మూవీ తన కలల ప్రాజెక్టు అని చాలా సందర్బాల్లో చెప్పారు. భక్త కన్నప్ప కథతో రూపొందనున్న ఈ సినిమాకు ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహించనున్నారు. ఇటీవలే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్తోంది. ఈ క్రమంలో కన్నప్ప సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్‌ డేట్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డార్లింగ్ ప్రభాస్‌  ఈ సినిమాలో అతిథి పాత్ర పోషించనున్నారని సమాచారం. ప్రభాస్ పాత్ర కన్నప్ప మూవీలో ఎంతో కీలకంగా ఉండనుందని ఫిల్మ్ నగర్ లో చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన అంశంపై మంచు విష్ణు స్పందించారు.

ఆయన ఏంచెప్పకుండా..  హర హర మహాదేవ్‌.. అని ట్వీట్‌ చేశారు. కన్నప్ప మూవీలో ప్రభాస్‌ శివుడిగా కనిపించనున్నారని అభిమానులు భావిస్తున్నారు. ఇక కన్నప్ప సినిమాలో నుపుర్‌ సనన్‌ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నప్ప భక్తిని, ఆయన గొప్పతనాన్నీ నేటి తరానికి తెలియజేయాలనే సంకల్పంతో పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్న సినిమా ఇది అని మంచు విష్ణు గతంలో చెప్పారు. పరుచూరి గోపాలకృష్ణ, బుర్ర సాయిమాధవ్‌, తోట ప్రసాద్‌ కథకు మెరుగులు దిద్దగా, మణిశర్మ, స్టీఫెన్‌ దేవాసి సంగీతం అందిస్తున్నారు.


Comment As:

Comment (0)