Prabhas

ప్రభాస్‌ కు త్వరలోనే ఆపరేషన్.. మోకాలి నొప్పితో బాధపడుతున్న రెబల్ స్టార్

మూవీ రిపోర్ట్- చాలాకాలంగా రెబర్ స్టార్ ప్రభాస్ (Prabhas) తన సినిమాల్లో పెద్దగా డాన్స్ లు చేయడం లేదు. ఈ విషయాన్ని ఆయన అభిమానులు సైతం గమనించారు. ఐతే ఈ మధ్యకాలంలో ప్రభాస్ చేస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో డాన్స్ కు పెద్దగా అవకాశం కూడా లేదనుకోండి. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రభాస్ గత కొన్ని రోజులుగా మోకాలి నొప్పితో బాధపడుతున్నారని తెలుస్తోంది. బాహుబలి సినిమాలో సంవత్సరాల తరబడి యాక్షన్ సీన్స్ చెయ్యడంతో ప్రభాస్ కు మోకాలి నొప్పి సమస్య వచ్చిందట. అది ఇప్పటివరకు తగ్గలేదు సరికదా ఆయనను బాగా వేధిస్తోందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే ఈ మధ్య సినిమాల్లో ప్రభాస్ డాన్స్ లు లేకుండా చూసుకుంటున్నారని అంటున్నారు. 

తన మోకాలి నొప్పి సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు సర్జరీ చేయించుకోవాలని ప్రభాస్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఆయన మోకాలి ఆపరేషన్ (Knee surgery) కోసం విదేశాలకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అన్నట్లు ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సలార్ (Salaar), కల్కి 2898 (Kalki 2898) ఏడీ సినిమాలో కూడా పెద్దగా డాన్సులకు స్కోప్ లేదట. దీంతో ఈ సినిమాల షూటింగ్స్ అవ్వగానే తన మోకాలి సర్జరీకి వెళ్తాడని టాక్.

ఇక దర్శకుడు మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూర్తిగా కమర్షియల్ టచ్ ఉన్న ఈ సినిమాలో కామెడీ ,ఫైట్స్ తో పాటు డాన్సులు కూడా ఉన్నాయట.  అందుకే మారితి సినిమా సెట్స్ పైకి వెళ్లేకంటే ముందే తన నోకాలికి ఆపరేషన్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడట ప్రభాస్. అదన్నమాట సంగతి.


Comment As:

Comment (0)