PM Modi

బెంగళూరులో ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన మోదీ

చందమామపై చంద్రయాన్‌ - 3 దిగిన ప్రాంతానికి శివశక్తి పేరు - ప్రధాని మోదీ

నేషనల్ రిపోర్ట్- భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో (ISRO) ప్రయోగించిన చంద్రయాన్‌ - 3 (Chandrayaan-3) ద్వారా అసామాన్యమైన విజయం సాధించామని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. ఈ మేరకు బెంగళూరులో ఇస్రో శాస్త్రవేత్తలకు సెల్యూట్‌ చేస్తున్నట్లు చెస్తున్నట్లు చెబుతూ కొంత భావోద్వేగానికి గురయ్యారు. చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించేందుకు విదేశీ పర్యటన ముగించుకొని నేరుగా బెంగళూరుకు వచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రధాని రాక సందర్బంగా బెంగళూరు (bangalore) ఎయిర్ పోర్ట్ దగ్గరకు వచ్చిన అభిమానులకు మోదీ అభివాదం చేశారు. అక్కడి నుంచి నేరుగా పీణ్యలోని ఇస్రో కేంద్రానికి వెళ్లిన ప్రధాని ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ఈ సందర్భంగా చంద్రయాన్‌-3 ప్రయోగం తీరును ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌, మోదీకి వివరించారు.

ఈ సందర్బంగా మాట్లాడిన ప్రధాని మోదీ.. ఇస్రో సాధించిన విజయం చాలా గర్వకారణమని అన్నారు. చంద్రయాన్‌ - 3 సాఫ్ట్‌ ల్యాండింగ్‌ సమయంలో తాను దక్షిణాఫ్రికాలో ఉన్నా.. నా మనసంతా చంద్రయాన్‌ - 3 విజయంపైనే ఉందని చెప్పారు. చంద్రయాన్-3 విజయం పట్ల శాస్త్రవేత్లను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని తెలిపారు. చంద్రుడిపై భారత్‌ అడుగుపెట్టి.. అంతరిక్ష చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించామని మోదీ అన్నారు. ఇప్పుడు భారత్‌ చంద్రుడిపై ఉందన్న ప్రధాని.. మన సత్తా ఏమిటో ప్రపంచానికి చాటామని అన్నారు. ప్రపంచంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపగలమని నిరూపించామని, గతంలో ఎవరూ చేయలేనిది ఇప్పుడు ఇస్రో చేసిందని, చంద్రయాన్‌ - 3 దిగిన ప్రదేశానికి శివశక్తి (Sivasakthi) పేరు పెట్టుకుందామని చెప్పారు. 

ఎంతో పట్టుదలతో పనిచేసి చంద్రయాన్‌ -3 విజయం సాధించామన్న ప్రధాని.. ఇప్పుడు ప్రతి ఇంటిపైనే కాదు..చంద్రుడిపైనా త్రివర్ణ పతాకం ఎగురుతోందని చెప్పారు. చంద్రయాన్‌ - 3 కృషిలో మహిళా శాస్త్రవేత్తలు ఉండటం గర్వకారణమని, మన నారీ శక్తి ఏమిటో ప్రపంచానికి మరోసారి చాటామని అన్నారు. ఇక చంద్రుడిపై మన జాతీయ పతాకం ఎగిరిన రోజు ఆగష్టు 23 ని నెషనల్ స్పెస్ డే (National Space Day) గా ప్రకటించారు ప్రధాని మోదీ.
 


Comment As:

Comment (0)