Jio Air Fiber

జియో ఎయిర్‌ఫైబర్‌ సర్వీసులను లాంచ్‌ చేసిన రిలయన్స్‌ 

జియో ఎయిర్‌ఫైబర్‌ కనెక్షన్‌ ఎలా తీసుకోవాలి?

టెక్నాలజీ రిపోర్ట్- అంతా చాలా కాలంగా ఎదురుచూస్తున్న జియో ఎయిర్‌ ఫైబర్‌ (Jio AirFiber) సర్వీసులను రిలయన్స్‌ జియో మంగళవారం అధికారికంగా లాంచ్‌ చేసింది. ఫైబర్‌ గ్రిడ్‌ నెట్‌ వర్క్‌ లేకుండా ఇంటర్నెట్ బ్రాండ్‌ బ్యాండ్‌ సదుపాయం అందించేందుకు ఈ ఎయిర్‌ ఫైబర్‌ ఉపయోగపడుతుంది. ముందుగా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, దిల్లీ, కోల్‌కతా, ముంబయి, పుణె.. మొత్తం 8 మెట్రో నగరాల్లో ఎయిర్‌ ఫైబర్‌ సేవలను ప్రారంభించింది రిలయన్స్. త్వరలోనే మరి కొన్ని నగరాలకు ఈ సేవలు విస్తరించనున్నామని ప్రకటించింది జియో. ఇప్పటికే ఎయిర్‌ టెల్‌ సంస్థ ఈ తరహా సేవలను మొదలుపెట్టింది. దీంతో ఎయిర్‌ ఫైబర్‌ విభాగంలో ఎయిర్ టెల్, జియో సంస్థలకు గట్టి పోటీ నెలకొంది. 

ఇక జియో ఎయిర్‌ ఫైబర్‌ ఎలా బుక్‌ చేయాలి, ప్లాన్లు ఎంటీ అన్న వివరాలు తెలుసుకుందామా..

జియో ఎయిర్‌ ఫైబర్‌ (Jio AirFiber) బుక్‌ చేయడానికి 60008-60008 నంబర్‌ కు మిస్డ్‌ కాల్‌ ఇవ్వాలి. లేదంటే జియో.కామ్‌ లో లేదా దగ్గర్లోని జియో స్టోర్‌కి వెళ్లి జియో ఎయిర్‌ ఫైబర్‌ సర్వీసుల కోసం రిక్వెస్ట్‌ పంపించొచ్చు. ఇది వరకే జియో ఫైబర్‌ సేవలను పొందుతున్న వారూ కనెక్షన్‌ తీసుకోవచ్చు. ఒకసారి కనెక్షన్‌ కోసం రిక్వెస్ట్‌ చేశాక.. జియో ప్రతినిధులు మిమ్మల్ని సంప్రదిస్తారు. ఎయిర్‌ ఫైబర్‌ కనెక్షన్‌ బుకింగ్‌ కోసం జియో 100 రూపాయలు ఛార్జీ చేస్తోంది. ఈ మొత్తాన్ని తరువాత ఎంచుకునే ప్లాన్ మొత్తం నుంచి మినహాయిస్తారు. వచ్చే నెల అక్టోబర్‌ 1వ తేదీ నుంచి యో ఎయిర్‌ ఫైబర్‌ ఇన్‌స్టలేషన్లు మొదలుకానున్నాయి.

ఇక జియో ఎయిర్‌ ఫైబర్‌ (Jio AirFiber) అనేది ప్లగ్‌ అండ్‌ ప్లే డివైజ్‌ వస్తుంది. ఈ కనెక్షన్‌ పై ఇంటర్నెట్‌ సేవలతో పాటు డిజిటల్‌ టీవీ ఛానెళ్లు కూడా వీక్షించవచ్చని జియే పేర్కొంది. ఇందుకోసం జియో వైఫై రౌటర్‌ ను, 4కె స్మార్ట్‌ సెటాప్‌ బాక్స్‌ ను జియో అందిస్తోంది. వాయిస్‌ యాక్టివ్‌ రిమోట్ కూడా కనెక్షన్‌ తో పాటు ఇస్తోంది జియో. ఇంటర్నెట్ సిగ్నల్‌ కోసం ఇంటి పైకప్పు మీద లేదా ఇంటి బయట ఔట్‌ డోర్ యూనిట్‌ ను అమరుస్తారు. ఇందుకోసం 1000 ఇన్‌ స్టలేషన్‌ ఛార్జి వసూలు చేస్తారు. ఐతే వార్షిక ప్లాన్‌ తీసుకునే వారికి ఇన్‌ స్టలేషన్‌ ఛార్జి నుంచి మినహాయింపు ఉంటుందని జియో తెలిపింది. 

ఇక జియో ఎయిర్‌ ఫైబర్‌ (Jio AirFiber) రెండు రకాల ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఎయిర్‌ ఫైబర్‌ ప్లాన్స్‌ 599, 899, 1199 రూపాయలుగా జియో పేర్కొంది. జియో ఎయిర్‌ ఫైబర్‌ మ్యాక్స్‌ ప్లాన్ల ధరలు 1499, 2499, 3999 రూపాయలుగా నిర్ణయించింది. ప్లాన్‌ మొత్తానికి 18 శాతం జీఎస్టీ అదనంగా చెల్లించాలి. ఈ ప్లాన్లు 6 నెలలు, 12 నెలల కాలసమయంతో అందుబాటులో ఉన్నాయి. జియో ఎయిర్‌ ఫైబర్‌ 599 ప్లాన్‌ ను తీసుకుంటే 6 నెలలకు జీఎస్టీ, ఇన్‌స్టలేషన్‌ తో కలిపి సుమారు 5499 రూపాయలు చెల్లించాలి. ఇక 12 నెలల ప్లాన్ తీసుకుంటే ఇన్‌ స్టలేషన్‌ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది కాబట్టి 8600 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. అన్ని ప్లాన్లలో ఇంటర్నెట్‌ తో పాటు 550 కు పైగా డిజిటల్‌ ఛానెళ్లు వీక్షించవచ్చు. అంతే కాజు 14 ఓటీటీ యాప్స్‌ ఉచితంగా లభించనున్నాయి. 


Comment As:

Comment (0)