Revanth Reddy Seethakka

సీతక్కను ముఖ్యమంత్రిని చేస్తామన్న రేవంత్ రెడ్డి

పొలిటికల్ న్యూస్- తెలంగాణలో అధికారంలోకి వచ్చేది తామేనని చెప్పే రేవంత్ రెడ్డి నోటి నుంచి ముఖ్యమంత్రి క్యాండెట్ గురించి మరో పెరు వచ్చే సరికి అంతా షాక్ కు గురవుతున్నారు. అందులోను టీ కాంగ్రెస్ నేతలు రెవంత్ వ్యాఖ్యలకు విస్మయం చెందుతున్నారు. అమెరికా పర్యటనలో ఉన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తానా సభల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో దళితులు, గిరిజనులకు పెద్ద పీట వేస్తామని చెప్పిన రేవంత్.. అవసరమైతే  ములుగు ఎమ్మెల్యే సీతక్కను ముఖ్యమంత్రిని చేస్తామని కామెంట్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే దళితులు, గిరిజనులకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని రేవంత్‌ ను ఎన్నారైలు కోరడంతో.. రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

అవసరమైతే సీతక్కను సీఎం చేస్తామని, కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన, ఎస్సీ, ఎస్టీల పక్షాన నిలుస్తుందని చెప్పారు. దళితుడైన మల్లికార్జున ఖర్గేను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిని చేసిందని ఈ సందర్బంగా రేవంత్ గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ వచ్చేసి దళితులు, గిరిజనులకు అనుకూలంగా ఉందన్న ఆయన.. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ముఖ్యమంత్రులు కావొచ్చని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో పని చేసే వారికి గౌరవం ఖచ్చితంగా దక్కుతుందని.. పదవుల కోసం ఎవరు పైరవీలు చేసుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఏదేమైనా సీతక్కను సీఎం చేస్తామని రేవంత్ చెప్పడం మాత్రం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశమవుతోంది.


Comment As:

Comment (0)