Kent

ఉగ్రవాదులతో దాడిలో సైనికుడి ప్రాణాలను రక్షించి వీరమరణం పొందిన కెంట్

భారత సైనికుడిని కాపాడి.. ప్రాణ త్యాగం చేసిన జాగిలం

స్పెషల్ రిపోర్ట్- భారత సైన్యంలో పనిచే సైనికులే కాదు.. జాగిలం కూడా దేశం కోసం ప్రాణం త్యాగం చేస్తుందని నిరూపించిన ఘటన ఇది. ఉగ్రవాదుల దాడిలో భారత సైనికుడిని రక్షించే టైంలో ఇండియన్‌ ఆర్మీకి (Indian Army) చెందిన కెంట్ (Kent) అనే ఆరేళ్ల జాగిలం ప్రాణాలు కోల్పోయి వీర మరణం పొందింది. జమ్మూకశ్మీర్‌ లోని రాజౌరీలో మంగళవారం సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టిన ఆర్మీ స్పెషల్ టీం.. ఆరేళ్ల జాగిలం కెంట్‌ ను సైతం తీసుకువెళ్లింది. 

ఆపరేషన్‌ సుజలిగాల (Operation Sujaligala) లో భాగంగా ఒక దట్టమైన పొద దగ్గర సైనికుల బృందం కెంట్‌ను ఫాలో అవుతోంది. ఈ క్రమంలో ఉగ్రవాదులను పసిగట్టిన జాగిలం వెంటనే సైన్యాన్ని అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో తీవ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ నేపథ్యంలో ఓ సైనికుడిని ఉగ్రవాదులు చుట్టుముట్టడంతో కెంట్ ధైర్యంగా వారికి ఎదురెళ్లి నులుచుంది. దీంతో ఉగ్రవాదుల భారీ కాల్పుల మధ్య ఆ జాగిలం తీవ్రంగా గాయపడి, కాసేపటికి చనిపోయింది.

ఆరేళ్ల జాగిలం కెంట్ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ భారత సైన్యం నివాళుల అర్పించింది. ఇది ఎంతో విచారకరమైన వార్త, 21వ ఆర్మీ డాగ్‌ యూనిట్‌ లోని లాబ్రడార్‌ జాతికి చెందిన ఆడ జాగిలం (కెంట్) తన సైనికుడి ప్రాణాలను రక్షించే క్రమంలో ప్రాణాలను కోల్పోయింది.. దేశం కోసం చేసిన గొప్ప త్యాగం ఇది..అని ట్విట్టర్ లో పేర్కొంది ఇండియన్ ఆర్మీ. భారత సైనికుడి ప్రాణాలు రక్షించి వీరమరణం పొందిన కెంట్ త్యాగాన్ని ఎప్పటికీ మరిచిపోలేమని చెప్పారు.


Comment As:

Comment (0)