విద్యార్థితో టీచర్ లైంగిక సంబంధం.. మరో బాలుడితో గర్భం..
ఇంటర్నేషనల్ రిపోర్ట్- విద్యార్థులకు బుద్దిగా పాఠాలు చెప్పాల్సిన టీచర్ దారితప్పింది. తన వద్ద పాఠాలు నేర్చుకొంటున్న స్టూడెంట్స్ పైనే ఆమె కన్నేసింది. తనకంటే వయస్సులో చిన్నవాడైన ఓ విద్యార్థిని లొంగదీసుకొంది. ఆ స్టూడెంట్ తో తన లైంగిక వాంఛలు తీర్చుకొంది. అదికాస్త వివాదాస్పదమవ్వడంతో కోర్టుకు చేరింది. ఇప్పుడు సదరు కీచక టీచర్ వ్యవహారం బ్రిటన్ లో సంచలనంగా మారింది.
బ్రిటన్‌కు చెందిన రెబక్కా జాయ్‌నెస్ (Rebecca Joyness) (30) స్వతహాగా లెక్కల టీచర్. ఈ క్రమంలో 2021లో ఓ బాలుడికి లెక్కల్లో అదనపు తరగతులు తీసుకొంది. ఆ సమయంలో 11 అంకెల ఫోన్ నెంబర్ లో ఒక అంకె తప్ప మిగిలినవి చెప్పి తన మొబైల్ నెంబర్ కనుక్కోవాలని ఆ బాలుడికి ఛాలెంజ్ విసిరింది. ఆ తరవాత వారిద్దరి మధ్య మొబైల్ చాట్ తో మొదలైన బంధం బలపడింది. ఒక రోజు ఆ బాలుడిని షాపింగ్‌కు తీసుకెళ్లిన టీచర్ ఏకంగా 345 పౌండ్లు ఖరీదైన గూచీ బెల్ట్ కొనిచ్చింది.
ఆ తర్వాత తన అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లి ఆ స్టూడెంట్ ను మచ్చిక చేసుకుంది. అక్కడ ఇరువురి మధ్య లైంగిక సంబంధం ఏర్పడింది. ఈ విషయాన్ని ఆ బాలుడు తన ఫ్రెండ్స్ కు చెప్పడంతో అది కాస్త పోలీసులకు చేరింది. దీంతో టీచర్ జాయ్‌నెస్ ను పోలీసులు అరెస్టు చేశారు. బాలుడికి బెల్ట్ కొనిచ్చే దృశ్యాలు సీసీటీవీ నుంచి సేకరించారు. ఈ కేసులో ఆమె బెయిల్‌పై బయటకు వచ్చింది. ఇప్పుడీ ఘటన బ్రిటన్ లో సంచలనం సృష్టిస్తోంది.